ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాలంక క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Jul 06 , 2025 | 10:54 PM

కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందిన పాలంక పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన పాలంక వీరభద్రస్వామి తిరునాళ్ల తొలి ఏకాదశి పర్వదినాన నిర్వహిస్తారు.

వీరభద్ర స్వామి, భద్రకాళీ అమ్మవార్లకు పూజలు చేస్తున్న ఆర్చకుడు, సంతానం కోసం దోసిళ్లు పట్టేందుకు వేచి ఉన్న భక్తులు

స్వామి దర్శనానికి నల్లమల అడవిలో కాలినడకన వెళ్తున్న భక్తులు

ఘనంగా తొలి ఏకాదశి పండుగ

మూడు రోజుల ఉత్సవానికి ఏర్పాట్లు

ఎర్రగొండపాలెం రూరల్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందిన పాలంక పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన పాలంక వీరభద్రస్వామి తిరునాళ్ల తొలి ఏకాదశి పర్వదినాన నిర్వహిస్తారు. అటవీ ప్రాంతంలో ఉండడంతో కేవలం తొలి ఏకాదశి పండుగ మూడు రోజులు మాత్రమే ఈ ప్రాంతానికి భక్తులకు దర్శనం ఉంటుంది. శనివారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. పెద్ద కొండ మీద నుంచి ఆలయానికి సుమారు 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అక్కడ ఉన్న నీటి గుండంలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. పిల్లలు లేని దంపతులు ఆలయ ప్రాంగణంలో ఉన్న పంచలింగాలపై జాలువారే నీటి బిందువుల కోసం దోసిళ్లు పట్టారు. గతంలో మొక్కుకొని సంతానం కలిగిన వారు పిల్లాపాపలతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా కమిటీలు, పలు సంఘాల వారు ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌ డీ మంజునాథరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వసతుల ఏర్పాట్లను పరిశీలించారు.

Updated Date - Jul 06 , 2025 | 10:54 PM