అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - Jul 09 , 2025 | 11:14 PM
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని పొట్లపాడు గ్రామంలో జరిగిని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
కురిచేడు, జూలై 9(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని పొట్లపాడు గ్రామంలో జరిగిని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వ పనితీరు గురించి ప్రశ్నించగా సానుకూలత వ్యక్తం చేశారు. ఈసందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసి చూపిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం ముందుకుసాగుతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధివైపు పరుగులు తీయింస్తుందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంస పాలన సాగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలను తీసుకెళ్ళి వారికి తెలియజేస్తున్నామన్నారు. ప్రజల బాగోగులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాత్రి పొద్దుపోయే వరకు డాక్టర్ లక్ష్మి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పిడతల నెమిలయ్య, గ్రామ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
పామూరు: రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండలంలోని నుచ్చుపొద గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని కరపత్రాలు పంపిణీచేశారు. కార్యక్రమంలో ప్రబాకర్‌చౌదరి, ఎం. రమణయ్య, సూర్యప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, సీఎస్‌పురం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మన్నేపల్లి చిరంజీవి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆలా లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
ముండ్లమూరు: పేదలందరికీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందజేస్తుందని టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండలంలోని పెదఉల్లగల్లు గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జిల్లెలమూడి చౌదరి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మోతుకూరి శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 11:14 PM