ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - Jun 27 , 2025 | 12:35 AM

అభివృ ద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అ న్నారు. మండలంలోని శివరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న మొగిలిగుండాల రిజర్వాయర్‌, 132/33 కెవీ విద్యుత్‌ స బ్‌స్టేషన్‌ నిర్మాణ పనులను డాక్టర్‌ లక్ష్మి, లలి త్‌సాగర్‌, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి గురువారం పరిశీలించారు.

మొగిలిగుండాల రిజర్వాయర్‌ పనులను పరిశీలిస్తున్న డాక్టర్‌ లక్ష్మి తదితరులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

తాళ్లూరు, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): అభివృ ద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అ న్నారు. మండలంలోని శివరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న మొగిలిగుండాల రిజర్వాయర్‌, 132/33 కెవీ విద్యుత్‌ స బ్‌స్టేషన్‌ నిర్మాణ పనులను డాక్టర్‌ లక్ష్మి, లలి త్‌సాగర్‌, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వరరెడ్డి గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా రిజర్వాయర్‌ వద్ద జరిగిన సభలో డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ గత వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిం దన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు పాలన వికాసం వైపు పయనిస్తున్నదని చెప్పారు. తాళ్లూరు, పరిసర గ్రామాలకు సాగు నీరిచ్చే మొగలిగుండాల రిజర్వాయర్‌ నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూ రు చేసి పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. తదుపరి వైసీపీ పాలనలో కొంతమేర పనులు చేసి బిల్లులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్‌ పనులు నిలిపి వేశారన్నారు. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్‌ మొగిలిగుండాల రిజర్వాయ ర్‌ నిర్మాణం పూర్తిచేసి తాళ్లూరు ప్రాంత ప్రజల నీటి కష్టాలు పరిష్కరిస్తామని ఇచ్చిన మాట తీరనుందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు నే తృత్వంలో ప్రజాప్రభుత్వం బిల్లులు విడుదల చేసింద న్నారు. బిల్లులు జమకావటంతో ప్రభుత్వంపై నమ్మకం తో కాంట్రాక్టర్‌ తిరిగి వేగవంతంగా పనులు చేపడుతున్నారన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. రిజర్వా యర్‌ పూర్తయ్యేందుకు మరో రూ.2 కోట్లు అవసమవుతాయన్నారు. అధికారులు, మంత్రుల దృష్టికి తీసు కెళ్లి నిధులు మంజూరుచేయించి అసంపూర్తి పనులు పూర్తి చేయిస్తామన్నారు. ఈప్రాజెక్ట్‌తో భూగర్బ జలా లు పెరిగి తాళ్లూరు, పరిసర 20 గ్రా మాల ప్రజలకు సాగునీటి సమస్య తీ రుతుందన్నారు. కట్టల నిర్మాణాలు, కాంక్రీట్‌ పనులను ఆమె పరిశీలించారు.

గత టీడీపీ ప్రభుత్వంలో తాళ్లూరు పరిసర పలు గ్రామాల ప్రజలు, రైతాం గం ఎదుర్కొంటున్న లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి 132/33 కేవీ విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి నిధులు మం జూరయ్యాయని డాక్టర్‌ లక్ష్మి పేర్కొ న్నారు. ఆతర్వాత నిర్మాణ పనులు ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదన్నారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఉన్నతాధికారులను సంప్రదించి పనులు పూర్తయ్యేలా చూడాలని కోరినట్టు చెప్పారు. మంత్రి ఆదేశాలతో సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. రెండునెలల్లో పూర్తవుతాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, రమణారెడ్డి, కాంట్రాక్టర్‌ గురివిరెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణ, తిరుపతి స్వా మి, కల్యాణ్‌చక్రవర్తి, రామయ్య, శాగం కొండారెడ్డి. శ్రీనివాసరెడ్డి, ఆర్‌.వెంకట్రావు, ఇరిగేషన్‌ ఏఈ సుబ్బారావు, విద్యుత్‌ ఈఈ శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, ఏడీఈ ఆంజనేయులు, ఏఈ ఎం.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:35 AM