అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - May 27 , 2025 | 12:35 AM
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు ఆన్నారు.
ఇంకొల్లు, మే 26,(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు ఆన్నారు. ఇంకొల్లు- పర్చూరు ఆర్‌అండ్‌బీ రహదారికి టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు చేయడంపై ఇంకొల్లు,పర్చూరు,కారంచేడు మండలాల టీడీపీ నాయకులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొల్లు మండల పరిధిలోని పాతమద్రాసు రహదారిలో వంకాయలపాడు సమీపంలోని అడ్డరోడ్డు వంతెన వద్ద సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి జనార్ధన్‌రెడ్డి, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి నేటి వరకు ఈ రహదారిలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ రహదారిలో ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లి రోడ్డు నిర్మాణానికి నిధుల కేటాయింపుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ రహదారి అభివృద్ధితో ఇంకొల్లు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు స్వీట్లు పంచిపెట్టారు. గామాలలో ప్రజలు సైతం నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇంకొల్లు, పర్చూరు, కారంచేడు మండల అధ్యక్షులు నాయుడు హనుమంతరావు, షేక్ షంషుద్ధీన్, శ్రీహరి, కరి శ్రీనివాసరావు, బేతపూడి శ్రీనివాసరావు, పేర్ని బాపయ్య, కరణం రమేష్, శ్రీనివాసరావు, మీరావలి, రమాదేవి, నాగేంద్రమ్మ, వీరాంజనేయులు, మూడు మండలాల నేతలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Updated Date - May 27 , 2025 | 12:36 AM