డిపాజిట్లు రూ.3కోట్లు గోల్‌మాల్
ABN, Publish Date - May 06 , 2025 | 01:29 AM
పామూరు పట్టణంలోని నెల్లూరు రోడ్డులో ఉన్న ఓ వాణిజ్య బ్యాంకులో సుమారు రూ.3 కోట్ల డిపాజిట్ నగదు గల్లంతైంది. సంబంధిత బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకు అధికారులు మరో మేనేజ ర్‌ను నియమించి విచారణ చేయిస్తున్నారు.
పరారీలో బ్యాంకు మేనేజర్
ఆందోళనలో ఖాతాదారులు
పామూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): పామూరు పట్టణంలోని నెల్లూరు రోడ్డులో ఉన్న ఓ వాణిజ్య బ్యాంకులో సుమారు రూ.3 కోట్ల డిపాజిట్ నగదు గల్లంతైంది. సంబంధిత బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకు అధికారులు మరో మేనేజ ర్‌ను నియమించి విచారణ చేయిస్తున్నారు. పట్టణానికి చెందిన ఓవ్యాపారి రూ.ఒక కోటి 6 లక్షలు డిపాజిట్ చేశారు. అందుకు సంబంధించి కౌంటర్ ఫైలు, దానిపై బ్యాంకు ముద్ర అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. అలాగే, మరో పది మందికి సంబంధించిన డిపాజిట్లు, రుణాలకు సంబంధించి చెల్లింపుల్లో తేడాలు ఉన్నాయి. ఈక్రమంలో బ్యాంకు మేనేజర్ పరారవడంతో విషయం బయటకు పొక్కింది. డిపాజిట్‌దారులకు అనుమానాలు తలెత్తి బ్యాంకు ఖాతాల్లోని బ్యాలెన్స్‌ను చూసుకోవడంతో సొమ్ము లేదన్న విషయం తేలింది. ఈవిషయమై బ్యాంక్ సిబ్బంది స్థానిక పోలీసులను సంప్రదించారు. ఖాతాదారులకు సంబంధించి ఎంత నగదు పోయిందో చెక్ చేసుకొని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వారికి పోలీసులు తెలిపారు. దీంతో చేసేదిలేక బ్యాంకు ఉన్నతాధికారుల ఆదేశాలతో మరో మేనేజర్‌ను నియమించి రహస్య విచారణ చేస్తున్నారు. దీనిపై బ్యాంకు సిబ్బంది స్పందించడం లేదు. ఖాతాదారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
Updated Date - May 06 , 2025 | 01:29 AM