ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నియోజకవర్గ కేంద్రంలో సీవీఏపీ యూనిట్లు

ABN, Publish Date - Jun 26 , 2025 | 11:28 PM

వికసిత భారత్‌, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనలో భాగంగా విజన్‌ 2029 పేరుతో ఐదేళ్లలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం ప్రస్తుతం వాటి అమలుపై దృష్టిసారించింది.

ఎమ్మెల్యే సారఽథ్యంలో అమలు

స్పెషల్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణ

సభ్యులుగా మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు

ఐదుగురు సచివాలయ సిబ్బంది నియామకం

మునిసిపాటీల్లో చైర్మన్‌, కమిషనర్‌ కూడా

ప్రస్తుత ఏడాది ప్రణాళిక అమలుపై పది రోజుల్లో సమీక్షలకు ప్రభుత్వం ఆదేశం

ఒంగోలు, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) : వికసిత భారత్‌, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనలో భాగంగా విజన్‌ 2029 పేరుతో ఐదేళ్లలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం ప్రస్తుతం వాటి అమలుపై దృష్టిసారించింది. నాలుగు రోజుల క్రితం అమరావతిలో సుపరిపాలనకు ఏడాది సభను ప్రభుత్వం నిర్వహించగా అందులో విజన్‌ ప్రణాళికల అమలుపై సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో 15శాతం వృద్ధి లక్ష్యంతో అన్ని రంగాలలో అభివృద్ధి ప్రణాళికలను రూపొందించారు. ఈ ప్రణాళికలను నియోజకవర్గం యూనిట్‌గా స్థానిక ఎమ్మెల్యే భాగస్వామ్యంతో అమలు చేయడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని గుర్తించి నాలుగు నెలలుగా తదనుగుణంగా కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొలిక్కి వచ్చింది.

ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు

ఎమ్మెల్యేల సారఽథ్యంలో ఆ పరిధిలోని పట్టణ, మండలాల ప్రణాళికలు క్రోడీకరించి నియోజకవర్గ ప్రణాళిక రూపొందించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26) లక్ష్యాలను సాధించేందుకు కార్యాచరణ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యే సారఽథ్యంలో ఇందుకోసం కానిస్టెన్సీ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌(సీవీఏపీ) యూనిట్‌ పేరుతో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే సిబ్బంది నియామకం పూర్తయింది. సచివాలయాల్లో పనిచేసే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారిని నియోజకవర్గానికి ఐదుగురు సిబ్బందిని నియమించారు. తాజాగా యంగ్‌ ప్రొఫెషనల్‌ పేరుతో ఎంబీఏ లేదా బీటెక్‌ చదివిన వారిని ఒకరిని తీసుకుంటున్నారు. నియోజకవర్గానికి ఒక డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారు. ఎమ్మెల్యే సారఽథ్యంలో ఉండే సీవీఏపీ కమిటీలో ఆ పరిధిలోని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు సభ్యులుగా ఉంటారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో పట్టణ, స్థానిక సంస్థ ఉంటే ఆ సంస్థ మేనేజర్‌, చైర్మన్‌ అలాగే కమిషనర్‌ సభ్యులుగా ఉంటారు. మార్కాపురానికి స్పెషల్‌ ఆఫీసర్‌గా అక్కడి సబ్‌ కలెక్టర్‌, ఒంగోలు, కనిగిరిలకు అక్కడి ఆర్డీవోలు, ఇతర నియోజకవర్గాలకు ఎస్‌డీసీలను నియమించారు.

ప్రభుత్వ భవనాల్లో సీవీఏపీ కార్యాలయం

నియోజకవర్గ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లో సీవీఏపీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో యూనిట్‌లో ఫర్నీచర్‌ ఇతర అవసరాల కోసం రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు రానున్నాయి. వీటిఏర్పాటు ద్వారా నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకు ఒక ప్రత్యేక కార్యాలయం కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు వారు సొంత కార్యాలయాలను లేదా పార్టీ కార్యాలయాల నుంచే పనిచేస్తుండగా ప్రత్యేక సిబ్బంది కరువయ్యారు. ప్రస్తుత ఏర్పాటు చేస్తున్న సీవీఎపీ యూనిట్‌ ద్వారా అధికారిక కార్యాలయాలు కూడా ఏర్పడనున్నాయి.

సమన్వయ బాధ్యత నియోజకవర్గ కేంద్ర ఎంపీడీవోదే

సీవీఏపీ యూనిట్‌లోని సిబ్బంది అన్ని మండలాల అధికారులను సమన్వయం చేసే బాధ్యతను నియోజకవర్గ కేంద్ర ఎంపీడీవోలకు అప్పగించారు. అలా ఈ యూనిట్లలో ఎమ్మెల్యే, స్పెషలాఫీసర్‌, సమన్వయ ఎంపీడీవోలు కీలకం కానున్నారు. ఇదిలాఉండగా వచ్చనెల 7వ తేదీలోపు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో సీవీఎపీ యూనిట్‌ కార్యాలయాల ఏర్పాటు, నియోజకవర్గ విజన్‌ ప్లాన్‌ తొలి మీటింగ్‌లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణ చర్యలపై సంబంధిత అధికారులు దృష్టిసారించారు. ఇదే తరహాలో జిల్లా స్థాయి విజన్‌ ప్రణాళిక అమలుపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సారఽథ్యంలో కలెక్టర్‌ పర్యవేక్షణలో వివిధ కీలక శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశారు. అందులో కీలక ప్రజాప్రతినిధులు కూడా సభ్యులుగా ఉండనుండగా ఆ సమావేశాలను కూడా వెంటనే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jun 26 , 2025 | 11:28 PM