కొవిడ్‌పై అప్రమత్తం
ABN, Publish Date - Jun 04 , 2025 | 01:45 AM
దేశంలో కొవిడ్ వైరస్ మరోసారి విస్తరిస్తున్న నేపథ్యంలో నియంత్రణపై ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాలో మూడు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు.
జీజీహెచ్‌లో అన్ని ఏర్పాట్లు
ప్రత్యేక వార్డు, వైద్య పరికరాలు సిద్ధం
ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు
ఒంగోలు కార్పొరేషన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : దేశంలో కొవిడ్ వైరస్ మరోసారి విస్తరిస్తున్న నేపథ్యంలో నియంత్రణపై ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాలో మూడు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు.అందులోభా గంగా జీజీహెచ్‌లోని అమెరికన్ షెడ్స్‌లో పడకలను ఏర్పాటు చేశారు. అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రత్యేక ఓపీ వార్డును ఏర్పాటు చేశారు. అక్కడ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ వై.ఏడుకొండలు మాట్లాడుతూ రోజురోజుకూ కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చేవారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలా అని నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఎలాంటి అనుమానిత లక్షణాలు కనిపించినా జీజీహెచ్ వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్త్రీ, పురుషులకు వేర్వేరుగా కొవిడ్ వార్డులను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
Updated Date - Jun 04 , 2025 | 01:45 AM