నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి
ABN, Publish Date - Apr 07 , 2025 | 11:26 PM
అందరు పగలు, ప్రతీకారాలు విడనాడి ఆధ్యాత్మిక చింతన కలిగి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. సోమవారం ఈపూరుపాలెం పద్మనాభునిపేట, దేశాయిపేటలోని విఘ్నేశ్వర కాలనీ, రామన్నపేట, కఠారిపాలెంలోని సీతారామ దేవాలయంలో ప్రత్యేక పూజలకు హాజరయ్యారు.
ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : అందరు పగలు, ప్రతీకారాలు విడనాడి ఆధ్యాత్మిక చింతన కలిగి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. సోమవారం ఈపూరుపాలెం పద్మనాభునిపేట, దేశాయిపేటలోని విఘ్నేశ్వర కాలనీ, రామన్నపేట, కఠారిపాలెంలోని సీతారామ దేవాలయంలో ప్రత్యేక పూజలకు హాజరయ్యారు. ఆయా ప్రాంతాల్లో శ్రీరామ నవమి పందిళ్ల వద్ద కమిటీ ప్రతినిధులు నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Apr 07 , 2025 | 11:26 PM