ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టీచర్ల బదిలీల్లో గందరగోళం

ABN, Publish Date - May 25 , 2025 | 11:11 PM

ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళం నెలకొంది. సాంకేతిక సమస్యలతో పాయింట్ల కేటాయింపు అస్తవ్యప్తంగా మారింది. దీంతో టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. వెబ్‌సైట్‌లో సమస్యలు తలెత్తుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభమైన ఈనెల 21నుంచి రోజూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. జిల్లాస్థాయిలో పరిష్కరించలేక పాఠశాల విద్య కమిషనర్‌ కార్యాలయ ఐటీ విభాగానికి నివేదించినా ఫలితం కన్పించడం లేదు. కొందరు టీచర్లకు అసలు ఓటీపీ రాకపోవడంతో దరఖాస్తులు సమర్పించలేక సతమతమవుతున్నారు.

అస్తవ్యప్తంగా పాయింట్ల కేటాయింపు

సాంకేతిక సమస్యలతో అయోమయం

పరిష్కారం దొరక్క ఉపాధ్యాయుల గగ్గోలు

ఉపాధ్యాయుల బదిలీల్లో గందరగోళం నెలకొంది. సాంకేతిక సమస్యలతో పాయింట్ల కేటాయింపు అస్తవ్యప్తంగా మారింది. దీంతో టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. వెబ్‌సైట్‌లో సమస్యలు తలెత్తుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభమైన ఈనెల 21నుంచి రోజూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. జిల్లాస్థాయిలో పరిష్కరించలేక పాఠశాల విద్య కమిషనర్‌ కార్యాలయ ఐటీ విభాగానికి నివేదించినా ఫలితం కన్పించడం లేదు. కొందరు టీచర్లకు అసలు ఓటీపీ రాకపోవడంతో దరఖాస్తులు సమర్పించలేక సతమతమవుతున్నారు.

ఒంగోలు విద్య, మే 25 (ఆంధ్రజ్యోతి) : టీచర్ల బదిలీలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని రెండు నెలల ముందుగానే అదికారులు ప్రకటించినా ఆమేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు. టీచర్ల బదిలీల్లో పాయింట్ల కేటాయింపే కీలకం. వాటి ఆధారంగానే ఉపాధ్యాయులకు వారు కోరుకున్న స్థానాలను కేటాయిస్తారు. అయితే ఈ విషయంలోనూ తిరకాసు చోటుచేసుకుంది. గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల ప్రాథమిక సీనియారిటీ జాబితాల్లో ఒక్కరికి కూడా స్పౌజ్‌ పాయింట్లు కలవ లేదు. ఈ విషయం రెండు రోజుల క్రితం కమిషనర్‌ కార్యాలయ ఐటీ సెల్‌కు నివేదించినా పరిష్కారం కాలేదు. శనివారం రాత్రి కమిషనర్‌ కార్యాలయం హెచ్‌ఎంల ప్రాథమిక సీనియారిటీ జాబితాను స్పౌజ్‌ పాయింట్లు లేకుండానే విడుదల చేసింది. దీంతో వారు ఆందోళన చెందుతూ ఆదివారం డీఈవోను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. కొందరికి స్పౌజ్‌ ఉందని సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేసినా ఐదు పాయింట్లు కలవడం లేదు. మరికొందరికి సర్టిఫికెట్‌ లేకపోయినా, స్పౌజ్‌ లేదని చెప్పినా పాయింట్లు కలిశాయి.

చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న కొందరు మహిళలకు ఐదు పాయింట్లు కలవలేదు.

కొందరు టీచర్లకు పునర్విభజన పాయింట్లు, మరికొందరికి వారు పనిచేస్తున్న స్టేషన్‌ పాయింట్లు కలవడం లేదు.

కొందరు టీచర్లు బదిలీ దరఖాస్తు కోసం ఐడీ నంబరు ఎంటర్‌ చేసినా ఓటీపీ రావడం లేదు. అలాంటి వారు దరఖాస్తు చేయలేక డీఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

2021లో బదిలీ అయిన వారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకుంటే వారికి పాయింట్లు రావడం లేదు.

అవివాహిత మహిళా టీచర్లకు పాయింట్లు కలవడం లేదు.

పునర్విభజనలో మిగులుగా తేలి తప్పని సరిగా బదిలీ కావాల్సిన వారికి వారి పాత స్టేషన్‌ పాయింట్లు కలవడం లేదు.

పాయింట్ల విషయంలో పూటపూటకూ మార్పులు

బదిలీ పాయింట్ల కేటాయింపులో పూటపూటకూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్ల విషయంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఒకే డీఎస్సీలో ఎంపికై ఒకే రోజు ఉద్యోగంలో చేరి ఒకే కేటగిరీ పాఠశాలల్లో పనిచేస్తూ 23వతేదీన దరఖాస్తు చేసిన వారికి, 24న దరఖాస్తు చేసిన వారికి పాయింట్లలో తేడా రావడంతో ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు మార్పులు, చేర్పులకు అనుగుణంగా రాతపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వకుండా కేవలం వెబెక్స్‌లో నోటిమాటతో బదిలీల ప్రక్రియను నడిపిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - May 25 , 2025 | 11:11 PM