విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులు
ABN, Publish Date - Apr 28 , 2025 | 01:38 AM
రాష్ట్రంలో పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ, ఉపా ధ్యాయుల పునర్వీభజనలో అధికారులు రోజు కోక ప్రతిపాదన, పూటకోక సవరణతో గంద రగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి ఆ రోపించారు.
ఎస్టీఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి
ఒంగోలు విద్య, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ, ఉపా ధ్యాయుల పునర్వీభజనలో అధికారులు రోజు కోక ప్రతిపాదన, పూటకోక సవరణతో గంద రగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి ఆ రోపించారు. ఆదివారం ఒంగోలులోని మల్ల య్యలింగం భవన్‌లో జరిగిన సంఘ జిల్లా కా ర్యవర్గ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కె.య ర్రయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సం ఘాలతో చర్చించేది ఒకరకంగా, కార్యచరణ మరోలా ఉండటం శోఛనీయమన్నారు. ఈ వి షయంలో ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి జో క్యం చేసుకొని గందరగోళ పరిస్థితులను చక్క దిద్దాలని కోరారు. రాష్ట్ర అదనపు ప్రధా నకార్యదర్శి పి.రమణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ సీపీఎస్‌కు బదులుగా ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్నారు. పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి వెంటనే ఐ ఆర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉ ద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిం చారు. సమావేశంలో నెల్లూరు జిల్లా అధ్యక్షు డు అశోక్‌బాబు, జిల్లా ప్రధానకార్యదర్శి జి. నరసింహారెడ్డి, ఆర్థిక కార్యదర్శి నాగయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయ కులు మాలకొండయ్య, ఆదినారాయణ, దాసరి శ్రీనివాసులు, కడియాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 28 , 2025 | 01:39 AM