ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పశు వైద్య శాల సిబ్బంది అవస్థలు

ABN, Publish Date - Apr 17 , 2025 | 11:52 PM

పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకుల (ఏడీ) కార్యాలయం, ఆసుపత్రిలో అసౌకర్యాల నడుమ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. సొంత భవనం నిర్మించాలన్న దశాబ్దాల ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. చాలీచాలని ఇరుకు గదులు, ప్రాంగణంలో ఇటు ఇబ్బంది, అటు పశు పోషకులు తీవ్ర ఇ బ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది.

వైద్యశాల ప్రాంగణంలో మందులను తీసుకెళ్తున్న సిబ్బంది

మందులను నిల్వ చేసుకునే వసతి కరువు

ఒక్కరోజులోనే వాటి పంపిణీకి పరుగులు

పర్చూరు, ఏప్రిల్‌ 17 (ఆంఽధ్రజ్యోతి) : పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకుల (ఏడీ) కార్యాలయం, ఆసుపత్రిలో అసౌకర్యాల నడుమ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. సొంత భవనం నిర్మించాలన్న దశాబ్దాల ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. చాలీచాలని ఇరుకు గదులు, ప్రాంగణంలో ఇటు ఇబ్బంది, అటు పశు పోషకులు తీవ్ర ఇ బ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. మండల పరిషత్‌ కార్యాల యం ప్రాంగణ స్థలంలో ఆక్రమించి కట్టిన నివాసంలో తాత్కాలికంగా పశు వైద్యశాలను నడుపుతున్నారు. రెండు చిన్నగదులే ఉండడంతో కనీసం మందులు భద్రపరుచుకునే అవకాశం లేదు. గురువారం ఏడీ పరిధిలో ఆయా గ్రామీణ పశువుల ఆసుపత్రులకు మందులు పంపిణీ చేసేందుకు పెద్ద మొత్తంలో పర్చూరు పశువైద్యశాల (ఏడీ)కు మం దులు వచ్చాయి. ఇక్కడ మందులు నిల్వ చేసే వసతి లేకపోవడంతో వైద్యశాల ఆవరణలోనే వెనువెంటనే ఆయా పశు వైద్యశాలలకు మందులను పంపిణీ చేశారు. ఈ క్రమంలో దీంతో మందులు ఇచ్చినవారు, తీసుకెళ్లేందుకు వచ్చిన సిబ్బంది నానా అవస్థలు పడ్డారు.

Updated Date - Apr 17 , 2025 | 11:53 PM