కమిషనర్ ఆకస్మిక తనిఖీ
ABN, Publish Date - Jul 10 , 2025 | 11:37 PM
పట్టణంలోని పలు వీధులను మున్సిపల్ కమిషనర్ రమణబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని చోట్ల మురుగు కాలువల్లో చెత్తాచెదారంతో ఎండిపోయి ఉండడాన్ని గ మనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రైనేజీని పరిశీలిస్తున్న కమిషనర్ రమణబాబు
గిద్దలూరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు వీధులను మున్సిపల్ కమిషనర్ రమణబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొన్ని చోట్ల మురుగు కాలువల్లో చెత్తాచెదారంతో ఎండిపోయి ఉండడాన్ని గ మనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల ప్రజలను పిలిచి చెత్తను రోజూ చెత్త రిక్షాలలో మాత్రమే వేయాలని సూచించా రు. చెత్తను కాల్వలో వేస్తే మురుగు కదలక దోమలు పెరిగి రోగాలబారిన పడతారన్నారు. పలు చోట్ల జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. నాణ్యతతో వేయాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు.
Updated Date - Jul 10 , 2025 | 11:37 PM