నేడు సింగరాయకొండలో సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం
ABN, Publish Date - May 04 , 2025 | 01:26 AM
సింగరాయకొండ మండల కాంప్లెక్స్‌లో నూతనంగా నిర్మించిన భవనంలో సివిల్ జడ్జి కోర్టు ఆదివారం ప్రారంభం కానుంది.
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సివిల్ జడ్జి కోర్టు
హాజరుకానున్న హైకోర్టు న్యాయమూర్తులు
సింగరాయకొండ, మే 3 (ఆంధ్రజ్యోతి) : సింగరాయకొండ మండల కాంప్లెక్స్‌లో నూతనంగా నిర్మించిన భవనంలో సివిల్ జడ్జి కోర్టు ఆదివారం ప్రారంభం కానుంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ టి.రాజశేఖర్‌రావు, హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ కుంభజడల మన్మఽథరావు, జి.రామకృష్ణప్రసాద్, డాక్టర్ వై.లక్ష్మణరావు, జిల్లా ప్రధాన న్యాయాధికారి భారతి హాజరవుతారని స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు తెలిపారు.
Updated Date - May 04 , 2025 | 01:26 AM