రైతుల అభ్యున్నతే లక్ష్యంగా చీమకుర్తి సొసైటీ సేవలు
ABN, Publish Date - Jul 21 , 2025 | 11:01 PM
రైతుల అభ్యున్నతే లక్ష్యంగా చీమకుర్తి విశాల పరపతి సేవా సంఘం సేవలను అందిస్తామని సొసైటీ నూతన చైర్మన్ పూనాటి వెంకట్రావు చెప్పారు. చీమకుర్తి సొసైటీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చైర్మగా పూనాటి వెంకట్రావు, డైరెక్టర్లుగా యానం వెంకటేశ్వర్లు, బ్రహ్మారెడ్డిలు పదవీ బాధ్యతలు చేపట్టారు.
చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పూనాటి వెంకట్రావు
చీమకుర్తి, జూలై 21(ఆంధ్రజ్యోతి) : రైతుల అభ్యున్నతే లక్ష్యంగా చీమకుర్తి విశాల పరపతి సేవా సంఘం సేవలను అందిస్తామని సొసైటీ నూతన చైర్మన్ పూనాటి వెంకట్రావు చెప్పారు. చీమకుర్తి సొసైటీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చైర్మగా పూనాటి వెంకట్రావు, డైరెక్టర్లుగా యానం వెంకటేశ్వర్లు, బ్రహ్మారెడ్డిలు పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు వారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ర్యాలీగా సొసైటీగా చేరుకొని బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిపాటి రాఘవరావు, కందిమళ్ల గంగాధరరావు, రావిపాటి రాంబాబు, కాట్రగడ్డ రమణయ్య, అవనిగడ్డ శేషారావు,అవిశినేని వెంగన్న, గంగుల శివపార్వతి, నర్రా నాగరాజు, ఇస్తర్ల ఏడుకొండలు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి సొసైటీలో...
మద్దిపాడు, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : పెద్దకొత్తపల్లి సొసైటీ కమిటీ చైర్మన్‌గా మండవ హరిప్రసాద్, ఉపాధ్యక్షునిగా నల్లూరి సంజీవరావు, ఇతర మెంబర్లు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ పెద్దకొత్తపల్లి సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల్లో రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందించి ఉన్నతికి తోడ్పడతామన్నారు. రైతులు సహకరించి డిపాజిట్లు చేయాలని కోరారు. సంజీవరావు మాట్లాడతూ సెనగలు కొనుగోలు, ఎరువుల అమ్మకాలను చేపట్టి సొసైటీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎన్ పాడు టీడీపీ కో ఆర్డినేటర్ మండవ జయంతి బాబు, లింగంగుంట ఎంపీటీసీ సభ్యుడు మన్నం కృష్ణ, నల్లూరి అజయ్‌బాబు, నర్రా సురేష్ బాబు, ముల్లూరి మురళి, ఓగూరి వెంకట శేషయ్య, చుండూరి రఘురాం, మండవ వెంకటస్వామి, అద్దేపల్లి దుర్గాభవాని, దాసరి శిల్ప సౌందర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఓబన్నపాలెం, ఉప్పుగుండూరులో...
నాగులుప్పలపాడు, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : మండల పరిదిలోని ఓబన్నపాలెం, ఉప్పుగుండూరు సహకార సంఘాల త్రిమెన్ కమిటీ సభ్యులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఓబన్నపాలెం సొసైటీ అధ్యక్షునిగా మండవ ఆంజనేయులు, డైరెక్టర్లుగా ఈదర రాజశేఖర్, భీమవరపు వెంకటేశ్వర్లు, ఉప్పుగుండూరు సొసైటీ అధ్యక్షునిగా కాట్రగడ్డ చంద్రబాబు, డైరెక్టర్‌లుగా పెంట్యాల శ్రీనివాసరావు, మసిముక్కు భాస్కరరావు బాధ్యతలను స్వీకరించారు. కూటమి పార్టీ శ్రేణులు, రైతులు నూతన కమిటీ సభ్యులను అభినందించారు.
Updated Date - Jul 21 , 2025 | 11:01 PM