శ్రీమహావిష్ణువుగా చెన్నయ్య
ABN, Publish Date - Apr 20 , 2025 | 11:29 PM
బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆదివారం శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై నాలుగు మాఢవీధులలో విహరించారు. వాహనాలలో అతి ముఖ్యమైన గరుడ వాహనం దర్శించిన వారికి విజయం, కీర్తి, బలం సిద్ధిస్తాయని ఆలయ ప్రధానార్చకులు శ్రీపతి అప్పనాచార్యులు తెలిపారు. తెల్లవారుజామున 3గంటలకు చెన్నకేశవుని మహావిష్ణువు అలంకారంలో సర్వాలంకరణ భూషితడను చేసి గరుడ వాహనంపై ఆశీనులను చేశారు.
మార్కాపురం వన్‌టౌన్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆదివారం శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై నాలుగు మాఢవీధులలో విహరించారు. వాహనాలలో అతి ముఖ్యమైన గరుడ వాహనం దర్శించిన వారికి విజయం, కీర్తి, బలం సిద్ధిస్తాయని ఆలయ ప్రధానార్చకులు శ్రీపతి అప్పనాచార్యులు తెలిపారు. తెల్లవారుజామున 3గంటలకు చెన్నకేశవుని మహావిష్ణువు అలంకారంలో సర్వాలంకరణ భూషితడను చేసి గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. భేరీవాయిద్యాలు, వరంగల్ మహిళల తప్పెట్లు, వికాస తరంగిణి మహిళా సమాజం భక్తి గీతాలు, కళాకారుల వేషధారణలు, మహిళా కోలాట బృందాలు, మంగళవాయిద్యాలు, బాణసంచాల సందడి మధ్య నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబులు వాహన సేవలో పాల్గొన్నారు. ఉత్సవకమిటీ అధ్యక్షులు యక్కలి కాశీవిశ్వనాథం, ఈవో జి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.
నేడు గజ వాహనం, రథోత్సవం
బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం తెల్లవారుజామున చెన్నకేశవస్వామి గజవాహనంపై సార్వభౌమ అలంకారంలో నాలుగు మాడవీధులలో విహరించనున్నారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతుడై రథోత్సవంలో విహరించనున్నారు.
Updated Date - Apr 20 , 2025 | 11:29 PM