విలేజ్ క్లినిక్‌లను తనిఖీ
ABN, Publish Date - May 21 , 2025 | 11:55 PM
అర్ధవీడు మండలంలోని యాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నాగులవరం, కాకర్ల విలేజి హెల్త్ క్లినిక్‌లను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తని ఖీ చేశారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘పల్లె వైద్యం.. పేదలకు దూరం’ అనే శీర్షిక వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా అధికారి వెంకటేశ్వర్లు వైద్యశాలలో ఉన్న ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలను కలిసి విచారించారు.
కంభం, మే 21 (ఆంధ్రజ్యోతి) : అర్ధవీడు మండలంలోని యాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నాగులవరం, కాకర్ల విలేజి హెల్త్ క్లినిక్‌లను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తని ఖీ చేశారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘పల్లె వైద్యం.. పేదలకు దూరం’ అనే శీర్షిక వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా అధికారి వెంకటేశ్వర్లు వైద్యశాలలో ఉన్న ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలను కలిసి విచారించారు. ఎంఎల్‌హెచ్‌పీ, సీహెచ్‌వోలు ప్రస్తుతం సమ్మెలో ఉన్నందున వారికి బదులు ఏఎన్‌ఎంలు, ఆశాలు క్లినిక్‌లో వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. యాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అన్ని జాతీయ, ఆరోగ్య కార్యక్రమాలకు చెందిన రికార్డులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రులలో మందుల స్టోర్, ల్యాబ్, హాజరు పట్టిని పరిశీలించి విధులకు సక్రమంగా హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మందుల స్టోరు, ల్యాబ్‌లను పరిశీలించి కాలం చెల్లిన మందులను ఎప్పటికప్పుడు తీసివేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా పై మండలాల్లో విలేజ్ క్లినిక్‌లలో పని చేసే సిబ్బంది సమయపాలన పాటించాల్సిందిగా వెంకటేశ్వర్లు ఆదేశించారు. సిబ్బందికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు అన్ని వేళలా వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. విలేజి క్లినిక్‌లను నిర్వహించుటకు అవసరమైన అన్ని మందులు, పరికరాలు అందుబాటులో ఉంచుకోవలసిందిగా సూచించారు. సిబ్బందికి కేటాయించిన పని చేసే చోట నివాసం ఉండాలని ఆదేశించారు. ప్రజలకు హెల్త్ క్లినిక్‌లపై నమ్మకం కలిగేలా అంకిత భావంతో సేవ చేయాలన్నారు. వేసవి కాలంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్‌ఎస్, సెలైన్లు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
Updated Date - May 21 , 2025 | 11:55 PM