ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాలను జరుపుకోవాలి

ABN, Publish Date - Jun 02 , 2025 | 10:39 PM

పట్టణంలోని చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన శ్రీ మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో జ రుపుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నా రు. ఈనెల 5 నుంచి 13 వరకు జరిగే బ్రహ్మోత్స వాలకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

పామూరు జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన శ్రీ మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో జ రుపుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నా రు. ఈనెల 5 నుంచి 13 వరకు జరిగే బ్రహ్మోత్స వాలకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ, రాచరికపు పద్ధతులలో కాకుం డా సనాతన హిందూ సంప్రదాయ పద్ధతులలో భక్తి భావంతో తరతరాలుగా గుర్తుండేలా బ్రహ్మోత్సవలను జరుపుకోవాలన్నారు. అందుకుగాను దేవస్థాన ఉత్సవ కమిటీ సభ్యులదే తుది నిర్ణయంగా ఉండాలన్నారు. స్వామివార్ల రథోత్సవం సందర్భంగా విద్యుత్‌ తీగలతో అంతరాయం కలగకుండా శాశ్వత ప్రాతిపదికన తీగ లను సరిచేయాలన్నారు. పారిశుధ్య పనుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈసందర్భంగా తెలియక కొనుగోలు చేసిన దేవుడి మాన్యంకు సంబంధించిన ప్లాట్‌ను పామూరుకు చెందిన పాబోలు శివ ఎమ్మెల్యే ఉగ్ర సమక్షంలో రిజిస్ర్టేషన్‌ పత్రాలను దేవస్థానానికి అప్ప గించగా, పలువురు ఆయనను అభినందించారు. దేవుడి ఆస్తు లు, భూములను పరిరక్షించాల ని ఎమ్మెల్యే ఉగ్ర పేర్కొన్నారు.

సమావేశంలో విద్యుత్‌ ఈ ఈ ఉమకాంత్‌, డీఈ కృష్ణారెడ్డి, ఏఈ షేక్‌ జిలానిబాషా, కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్‌ యశ్వంత్‌, సీఐ ఎం.భీమానాయక్‌, ఎస్‌ఐ టి.కిశోర్‌బాబు, పంచాయతీ కార్యదర్శి జీవీ అరవిందరెడ్డి, ఆలయ ఈవో నరసింహబాబు, నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు, బి. జయరామిరెడ్డి, బి.నారాయణరెడ్డి కేవీ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 10:39 PM