ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పొన్న మానుపై నల్లనయ్యగా చెన్నయ్య

ABN, Publish Date - Apr 18 , 2025 | 10:57 PM

మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చెన్నకేశవస్వామి శుక్రవారం తెల్లవారుజామున మురళీకృష్ణ అలంకారంలో పొన్నవాహనంపై నాలుగు మాడవీధులలో విహరించారు.

వాహన సేవలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

మార్కాపురం వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చెన్నకేశవస్వామి శుక్రవారం తెల్లవారుజామున మురళీకృష్ణ అలంకారంలో పొన్నవాహనంపై నాలుగు మాడవీధులలో విహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో పొన్నమాను వాహనంపై చెన్నకేశవ స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. నాలుగు మాడవీధులలో విహరించిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కనక తప్పెట్లు, వివిధ కళారూపాలు, మహిళా కోలాటాల బృందం, కోలాటాలతో నగరత్సోవం సాగింది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్‌ యక్కలి కాశీవిశ్వనాథం, ఉభయదాతలు నగరోత్సవంలో పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 10:57 PM