ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:17 PM

ప్రభుత్వాసు పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్టు ఎమ్మె ల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సోమవారం కనిగిరిలోని ప్రభుత్వాసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు.

ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై వృద్ధురాలిని విచారిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసు పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్టు ఎమ్మె ల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సోమవారం కనిగిరిలోని ప్రభుత్వాసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆసుపత్రిలోని వార్డులన్నీ కలియతిరి గారు. కంగారు మదర్‌ కేంద్రాన్ని పరిశీలించారు. స్కానింగ్‌ గదులు, ఆపరేషన్‌ గదులను పరిశీలించా రు. మదర్‌కేర్‌ వార్డులోని బాలింతలను ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై విచారించారు. ఆసుపత్రి లోని సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్య సేవల్లో ఏమై నా ఇబ్బందులున్నాయా.. ఆసుపత్రిలో వైద్యులు సకా లంలో పరీక్షలు చేస్తున్నారా.. వైద్య సిబ్బంది ఎలా నడుచుకుంటున్నారు? అని రోగులను అడిగి తెలుసు కున్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తానని బాలింతలు, వారి బందువులను అడిగారు. ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యసేవలు బాగున్నాయని ఎమ్మెల్యేకు చెప్పారు.

అనంతరం దాదాపు రూ.ఒక కోటితో ఆసుపత్రి పైఅంతస్థులో నిర్మిస్తున్న నూతన డయాలసిస్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమా ణాలు పాటించాలని ఇంజనీర్‌కు సూచించారు. భవిష్య త్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మించాలని కోరారు. క్యూరింగ్‌ కూడా సక్రమంగా నిర్వహించాలన్నా రు. మెటీరియల్‌లో నాసిరకం వాడినట్లు తెలిస్తే ఉపే క్షించేది లేదన్నారు. ఎమ్మెల్యే వెంట డయాలసిస్‌ నూ తన భవన నిర్మాణ ఇంజనీర్లు, సిబ్బంది, అధికారులు ఉన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలి

సీఎస్‌పురం(పామూరు), జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప థకాలు ప్రజలకు సక్రమంగా అందేలా అధికారులు స మన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనర సింహారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన మండలస్థా యి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకు న్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మం డల పరిధిలో నిర్మాణాల్లో ఉన్న గ్రామ సచివాలయాలు, అంగన్‌వా డీ భవనాలు పూర్తి చేయాలన్నారు. మండలంలో తాగునీటి సమస్య లను పరిష్కరించేందుకు అవసర మైన గ్రామాల్లో వాటర్‌ప్లాంట్లు ఏ ర్పాటుకోసం ప్రణాళికలు రూపొం దించాలన్నారు. ఉపాధి పనులను వేగవంతం చేయాలన్నారు. డీజీపే ట నుంచి కోనపల్లికు వెళ్లే రహదా రి నిర్మాణానికి టెండర్లు పూర్తయిన ట్టు చెప్పారు. సమావేశంలో డీఎ ల్‌డీవో శ్రీనివాసులురెడ్డి, తహసీల్దా ర్‌ అహ్మద్‌ హుసేన్‌, ఎంపీడీవో ఎల్‌.బ్రహ్మయ్య, పంచాయతీ కా ర్యదర్శి వి.బ్రహ్మానందరెడ్డి టీడీపీ నాయకులు బి.వెంగయ్య, బొబ్బూ రి రమేష్‌, మాలకొండయ్య, చెరుకుపల్లి వెంకటరెడ్డి, సర్పంచ్‌ శీరాం పద్మావతి, లక్ష్మీదేవి, చావా చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

రక్తదానంలో భాగస్వాములు కావాలి

కనిగిరి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ రక్తదానంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌ లో సోమవారం జననీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించారు. 90 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రకాశం, వెంకన్న, ర మేష్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:17 PM