ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గొడ్డలి వేటును గుర్తుతెచ్చిన ‘వెన్నుపోటు దినం’

ABN, Publish Date - Jun 06 , 2025 | 12:07 AM

బాబాయికి గొడ్డలి వేటేసి వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి ప్రజలకు గుర్తు చేశారని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలో జవహర్‌నగర్‌ కాలనీలో టీడీపీ కార్యాలయంలో గురువారం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

జగన్‌రెడ్డి హయాంలో అప్పుల ఊబిలో రాష్ట్రం

తిరిగి చంద్రబాబు పాలనతో గాడిలోకి

ఎమ్మెల్యే నారాయణరెడ్డి

మార్కాపురం రూరల్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) : బాబాయికి గొడ్డలి వేటేసి వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి ప్రజలకు గుర్తు చేశారని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలో జవహర్‌నగర్‌ కాలనీలో టీడీపీ కార్యాలయంలో గురువారం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ పట్టణంలో ఆక్రమణల తొలగింపునకు రూ.50లక్షలు ఖర్చుచేశారని అవగాహన లేకుండా అవాస్తవాలు మాట్లాడడం వైసీపీ నాయకులకు తగదన్నారు. మీ పాలనలో రాష్ట్ర ఖజానాను లూటీ చేసి అప్పుల్లో కూరుకుపోయేలా చేశారని అన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడుతున్నారన్నారు. వైసీపీ నాయకులు దేవుడి భూమిని అన్యాక్రాతం చేశారని వాటిని అధికారులు గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవడం తప్పా అని కందుల ప్రశ్నించారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి భూములను ఆక్రమించిన వారి ఎవరనీ వదిలి పెట్టేది లేదన్నారు. వైసీపీ పాలనలో జరిగిన ఇసుక కుంభకోణంపై అధికారులు విచారిస్తున్నారన్నారు. ఏడాది పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతుండగా, అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదలు సంతోషంగా ఉండడాన్ని చూసి వైసీపీ నేతలు రోడ్లెక్కి నిరసనలు చేయడం సిగ్గుచేటని కందుల అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున, మాలపాటి వెంకటరెడ్డి, మౌలాలి, తాళ్లపల్లి సత్యనారాయణ, కౌన్సిలర్‌ కొండయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 12:07 AM