స్వచ్ఛ భారత్‌పై అవగాహన కల్పించాలి
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:20 PM
స్వచ్ఛ భారత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర బృందం సభ్యులు జి.సుధీర్, ఎమ్.ప్రశాంత్‌లు అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2025 కార్యక్రమంలో భాగంగా కేంద్ర బృందం సభ్యులు మండలంలోని పెదఅలవలపాడు గ్రామంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భం గా 20 గృహాలను పరిశీలించారు.
పెదఅలవలపాడులో పర్యటించిన కేంద్ర బృందం
పీసీపల్లి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ భారత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర బృందం సభ్యులు జి.సుధీర్, ఎమ్.ప్రశాంత్‌లు అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2025 కార్యక్రమంలో భాగంగా కేంద్ర బృందం సభ్యులు మండలంలోని పెదఅలవలపాడు గ్రామంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భం గా 20 గృహాలను పరిశీలించారు. ఆయా గృహాల్లో మరుగుదొడ్లు ఉన్నాయా, లేవా, సొంతంగా ఇంటిని నిర్మించుకున్నారా, ప్రభుత్వ నిధులతో నిర్మించుకున్నా రా? అని గృహ యజమానులను అడిగి తెలుసుకున్నా రు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఎలా ఉందంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలలోని మరు గుదొడ్లను పరిశీలించారు. వాటి వినియోగం, పారిశుధ్య నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పా రిశుధ్య నిర్వహణ, స్వచ్ఛభారత్‌పై అవగాహన, పారి శుధ్య పనుల గురించి సర్వే నిర్వహించిన బృందం వాటి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని బృందం సభ్యులు చెప్పారు.
అనంతంరం గ్రామ సచివాలయంలో జరిగిన సమా వేశంలో వారు మాట్లాడారు. తడిచెత్త, పొడిచెత్తను సేకరించి చెత్తసంపద కేంద్రానికి తరలించి కంపోస్టు ఎరువును తయారు చేయించాలని చెప్పారు. కంపో స్టు ఎరువులు తయారుచేసి విక్రయించడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందన్నారు. కా ర్యక్రమంలో ఎంపీడీవో హను మంతరావు, డిప్యూటీ ఎంపీ డీవో రాంప్రసాద్, ఆర్‌డబ్ల్యూ ఎస్ ఏఈ పవన్‌కుమార్, స్వ చ్ఛభారత్ కన్సల్టెంట్ ఖాజా వలి, జి.సురేష్‌బాబు, పంచా యతీ కార్యదర్శులు, ఇంజనీ రింగ్ అసిస్టెంట్‌లు, తదితరు లు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
కనిగిరి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): గ్రామాలు పరిశుభ్ర తతో ఉండాలని కేంద్ర బృందం సభ్యుడు రవికుమార్ అన్నారు. మండలంలోని గుడిపాడు గ్రామంలో సోమ వారం కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. గ్రామా ల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలను పరిశీలించారు. ఈసందర్భంగా రవికుమార్ గ్రామస్థులతో మాట్లాడు తూ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పంచాయతీ పారిశుధ్య సిబ్బంది ప్రతిరో జూ గ్రామంలో రోడ్లను పరిశుభ్రం చేయాలన్నారు. ఇంటి పరిసరాల సమీపంలో చిల్ల చెట్లను తొలగించాలని సూచించారు. నీటి నిల్వ తొట్టెలపై మూతలు లేకపోతే ఆయా ఇంటి యజమానులతో వెంటనే మూతలు పెట్టించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇళ్లలో మరుగు దొడ్లు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
గ్రామంలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలో సేకరించిన చెత్తనుంచి వర్మీ కంపోస్టు తయారీ చేస్తున్న షెడ్డును పరిశీలించారు. డ్రేనేజీల్లో దోమల నివారణ ఆయిల్‌ను పిచికారి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకరశర్మ, రామమోహ న్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 11:21 PM