నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ!
ABN, Publish Date - May 06 , 2025 | 11:32 PM
రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ఏడాదిన్నర నుంచి కొత్త కార్డులతో పాటు ప్రస్తుతం ఉన్న కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం అవకాశం లేకపోవడంతో పేద ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా బుధవారం నుంచి సచివాలయాల్లో కొత్త కార్డుల కోసం సంబంధిత ధృవీకరణ పత్రాలతో ధరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరణ
చేర్పులు, మార్పుల కోసం అవకాశం
ఒంగోలు కలెక్టరేట్, మే 6 (ఆంధ్రజ్యోతి) : రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ఏడాదిన్నర నుంచి కొత్త కార్డులతో పాటు ప్రస్తుతం ఉన్న కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం అవకాశం లేకపోవడంతో పేద ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా బుధవారం నుంచి సచివాలయాల్లో కొత్త కార్డుల కోసం సంబంధిత ధృవీకరణ పత్రాలతో ధరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇంకొక వైపు ప్రస్తుతం ఉన్న రేషన్ క కార్డుల్లో చేర్పులు, మార్పులతో పాటు నివాసం ఉండే ఆడ్రసులను కూడా మార్చుకోనేందుకు అవకాశం కల్పించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆమేరకు ప్రకటన చేయడంతో ఇప్పటి వరకు కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజానీకం సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలతో పాటు ఆదాయ ధృవీకరణకు కూడా రేషన్ కార్డేప్రమాణికం కావడంతో ఇప్పటి వరకు కార్డులు లేని పేదలు అనేక పథకాలను కూడా అందుకోలేకపోయారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలను అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ధరఖాస్తుల స్వీకరణను బుధవారం నుంచి ప్రారంభించనుండటంతో పేదల్లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా జిల్లాలోఇప్పటికే 10వేల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం ధరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పుడు వారందరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది. కాగా ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఉండగా వాటి స్థానంలో స్మార్ కార్డులు ఇస్తామని మంత్రి మనోహర్ ప్రకటించారు. ఈకేవైసీ కారణంగా స్మార్డ్ కార్డులు జారీ ఆలస్యమైందని వచ్చేనెలలో స్మార్ట్ కార్డులు ఇస్తామని మంత్రి ప్రకటించారు.
Updated Date - May 06 , 2025 | 11:32 PM