వీరయ్యచౌదరి హత్య కేసులో మరో మలుపు
ABN, Publish Date - Jun 08 , 2025 | 01:14 AM
టీడీపీ నాయకుడు వీరయ్యచౌదరి హత్య కేసు మరో మలుపు తిరిగింది. కిరాయి హంతకుడైన నెల్లూరు జిల్లాకు చెందిన నాగరాజును విచారించిన పోలీ సులకు ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలిశాయి.
గతంలోనే ఆయన్ను హతమార్చేందుకు ప్రయత్నించిన గ్యాంగ్
కార్యాలయానికి కత్తులతో వెళ్లి జనం ఉండటంతో వెనక్కి
హైదరాబాద్ ముఠా కోసం పోలీసుల వేట
బెయిల్ ప్రయత్నాల్లో సురేష్.. కోర్టులో విచారణ వాయిదా
ఒంగోలుక్రైం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ నాయకుడు వీరయ్యచౌదరి హత్య కేసు మరో మలుపు తిరిగింది. కిరాయి హంతకుడైన నెల్లూరు జిల్లాకు చెందిన నాగరాజును విచారించిన పోలీ సులకు ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలిశాయి. వీరయ్య చౌదరిని హత్య చేయడానికి ఆరు నెలల ముందే పథకం రూపొందించిన విషయం విదితమే. ఈమేరకు ఆయన్ను హతమార్చేందుకు తొలుత హైదరాబాద్ గ్యాంగ్‌ను పిలిపించారనేది కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. మీడియా సమావేశంలోనూ ఆ వివరాలను ఎస్పీ తెలిపారు. అయితే నాగరాజును విచారించిన తర్వాత మరిన్ని నిజాలు వెలుగుచూశాయి. వీరయ్యచౌదరిని హత్య చేసేందుకు హైదరాబాద్ నుంచి ముగ్గురు కిరాయి హంతకులు వచ్చి ఒంగోలులో మకాం వేశారు. ఏప్రి ల్‌లో ఆ ముగ్గురితోపాటు ప్రస్తుతం హత్యకేసులో నిందితులుగా ఉన్న గౌతం, నాగరాజులు కలిసి కత్తులు తీసుకొని వీరయ్యచౌదరి కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ ఎక్కువమంది ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని వెనుతిరిగారు. ఆ తర్వాత హైదరాబాద్ గ్యాంగ్ భయపడి వెళ్లిపోయింది. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఇరువురిని కలుపుకొని హత్య చేశారు. అయితే హైదరాబాద్ గ్యాంగ్‌తో ముప్పా సురేష్‌కు లింక్ ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ గ్యాంగ్‌ను ఎవరు మాట్లాడారన్న విషయమై ఆరా తీస్తున్నారు. ఆ ముఠా కోసం పోలీసులు వేట ప్రారంభించారు. వారు దొరికితే మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా వీరయ్యచౌదరి హత్య కేసులో సూత్రధారిగా ఉన్న ముప్పా సురేష్ 40 రోజులుగా పోలీసులకు దొరకలేదు. హైదరాబాద్‌కు బృందాలు వెళ్లి తిరిగి వచ్చాయి. ఆయనకు సంబంధించిన బంధువులను పోలీసులు విచారిస్తున్నారు. సురేష్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న గౌతమ్‌రెడ్డి రెండు దఫాలుగా రూ.లక్ష హత్య కేసులో ప్రఽధాన పాత్రధారి వినోద్‌కు పంపినట్లు గుర్తించారు. దీంతో గౌతమ్‌రెడ్డిని పిలిపించి పోలీసులు విచారణ చేశారు. సురేష్ చెబితే పంపినట్లు గౌతమ్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఈక్రమంలో సురేష్ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణ వాయిదాపడింది. కోర్టులో వచ్చే నిర్ణయం మేరకు సురేష్ లొంగిపోతాడనే ప్రచారం జరుగుతోంది.
Updated Date - Jun 08 , 2025 | 01:14 AM