ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఒంగోలుకు మరో బైపాస్‌

ABN, Publish Date - Apr 20 , 2025 | 12:03 AM

జిల్లా కేంద్రమైన ఒంగోలులో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు పశ్చిమం వైపు మరో బైపాస్‌ రోడ్డు ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి. అందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

పశ్చిమం వైపు ఏర్పాటుపై దృష్టి

రెండు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్న అధికారులు

త్రోవగుంట సమీపంలోని చీరాల రోడ్డు నుంచి చెరువుకొమ్ముపాలెం మీదుగా రింగ్‌రోడ్డు

రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయితేనే ఓకే చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

డీపీఆర్‌ పూర్తయ్యాక ఎమ్మెల్యేలతో భేటీకానున్న యంత్రాంగం

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రమైన ఒంగోలులో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు పశ్చిమం వైపు మరో బైపాస్‌ రోడ్డు ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి. అందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. రూ.వెయ్యి కోట్ల లోపు ప్రాజెక్టులకు అయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు మంజూరు చేస్తుండటంతో అందుకు అనుగుణంగా రెండు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రెండో బైసాస్‌ రోడ్డుపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈనెల 9న కలెక్టరేట్‌లో కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. తదనుగుణంగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారుచేసేలా చర్యలు తీసుకున్నారు.

రెండు ప్రతిపాదనలు

ముందుగా మద్దిపాడు మండలం కొష్టాల నుంచి టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం వద్ద కలిపే విధంగా డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు విలువ రూ.1,400 కోట్లకుపైన అవుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రెండో ప్రతిపాదనను కూడా సిద్ధం చేస్తున్నారు. త్రోవగుంట సమీపంలోని చీరాల రోడ్డు నుంచి లింగంగుంట, పేర్నమిట్ల మీదుగా మంగమూరు, భగీరథ ప్యాక్టరీ, చెరువుకొమ్ముపాలెం పక్కగా బీఈడీ కాలేజీ వద్ద జాతీయ రహదారిలో కలిపేందుకు మరో డీపీఆర్‌ నివేదికను రూపొందించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు రూ.800 కోట్లు వ్యయం అవుతుందని సమాచారం. ఇటీవల సంబంధిత అధికారులు ఎంపీ మాగుంటతో కూడా చర్చించినట్లు సమాచారం. అయితే కేంద్రం రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇస్తున్నందున తదనుగుణంగా డీపీఆర్‌లను సిద్ధం చేయాలని సూచించారు. అవి సిద్ధమయ్యాక సంబంధిత శాసనసభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. వాటిని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి అక్కడి నుంచి కేంద్రప్రభుత్వానికి పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Updated Date - Apr 20 , 2025 | 12:03 AM