ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంతా చేర్పులు, మార్పులే!

ABN, Publish Date - Jul 20 , 2025 | 01:22 AM

జిల్లాలో రేషన్‌ కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం రెండేళ్ల తర్వాత కొత్త వాటికి, ఇతర నమోదులకు అవకాశం కల్పించడంతో జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 84,812 మంది దరఖాస్తు చేసుకున్నారు.

రైస్‌ కార్డుల్లో పేర్ల నమోదు కోసం 60వేలకుపైగా దరఖాస్తులు

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్‌ కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం రెండేళ్ల తర్వాత కొత్త వాటికి, ఇతర నమోదులకు అవకాశం కల్పించడంతో జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 84,812 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రస్తుతం ఉన్న కార్డులో అదనంగా పేరు నమోదు కోసం అత్యధికంగా 60,849 దరఖాస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కార్డులో పేర్ల తొలగింపు కోసం మరో 1,481 వచ్చాయి. కొత్త రైస్‌ కార్డులు కోరుతూ 9,687 అందాయి. ఆధార్‌ నమోదు కోసం 1,125, రైస్‌ కార్డులో మార్పుల కోసం 593, అడ్రసు మార్పుల కోసం 2,481 దరఖాస్తులు వచ్చాయి. 42 మంది రైస్‌ కార్డులను సరెండర్‌ చేశారు. మరో 8,544 మంది కార్డు విభజన కోసం అభ్యర్థన పెట్టుకున్నారు. ఆ దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులను గుర్తిస్తున్నారు. ప్రభుత్వం ఆగస్టులో రైస్‌కార్డుల స్థానంలో స్మార్ట్‌కార్డులు ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అప్పుడే కార్డుల్లో చేర్పులు మార్పులతోపాటు కొత్త వారికి కూడా స్మార్ట్‌ కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jul 20 , 2025 | 01:22 AM