ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు

ABN, Publish Date - May 23 , 2025 | 11:18 PM

గుంటూరు నుంచి మార్కాపురం మీదుగా వెళ్లే పలు రైళ్లకు రైల్వేశాఖ అదనపు బోగీలు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌యూసీసీ సభ్యులు ఆర్‌కె.కె.జె.నరసింహం తెలిపారు.

మార్కాపురం, మే 23 (ఆంధ్రజ్యోతి) : గుంటూరు నుంచి మార్కాపురం మీదుగా వెళ్లే పలు రైళ్లకు రైల్వేశాఖ అదనపు బోగీలు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌యూసీసీ సభ్యులు ఆర్‌కె.కె.జె.నరసింహం తెలిపారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఆయా రైళ్లకు అదనపు బోగీలు రైల్వే అధికారులు కేటాయించారన్నారు. ఈ నెల 29 నుంచి నరసాపురం నుంచి హుబ్లీ వెళ్లే 17225/17226 నెంబర్ల అమరావతి ఎక్స్‌ప్రె్‌సకు 2 ఏసీ టూ టైర్‌, ఒక స్లీపర్‌ బోగీలు, ఈ నెల 23 నుంచి యశ్వంత్‌పూర్‌ నుంచి మచిలీపట్నం మధ్య నడిచే 17211/17212 నెంబర్లుగల కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఒక అదనపు ఏసీ త్రీ టైర్‌ బోగీ, ఈ నెల 27 నుంచి గుంటూరు నుంచి తిరుపతి మధ్య నడిచే 17261/17262 నెంబర్లుగల ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఒక్కొక్కటి చొప్పున సీప్లర్‌, జనరల్‌ బోగీలు, ఈ నెల 25 నుంచి గుంటూరు నుంచి ఔరంగాబాద్‌ మధ్య నడిచే 17253/17254 నెంబర్లుగల ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఒక స్లీపర్‌ బోగీనీ కేటాయించినట్లు ఆయన తెలిపారు.

Updated Date - May 23 , 2025 | 11:18 PM