సాక్షి జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేనిపై చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - Jun 09 , 2025 | 11:02 PM
రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలపై సాక్షి జర్నలిస్టులు కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు రమణమ్మ సోమవారం తీవ్రంగా ఖండించారు.
సాక్షి దినపత్రిక ప్రతులను దహనం చేస్తున్న టీడీపీ మహిళా నాయకులు
ఎర్రగొండపాలెం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలపై సాక్షి జర్నలిస్టులు కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు రమణమ్మ సోమవారం తీవ్రంగా ఖండించారు. అమరావతి మహిళలపై సాక్షి జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎర్రగొండపాలెం అంబేద్కర్ సెంటరులో సాక్షి ప్రతులను మహిళ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోళ్ల సుబ్బారావు, కొత్తమాసు సుబ్రమణ్యం, తోట మహేష్, పట్టణ అధ్యక్షులు పి.మల్లిఖార్జున, చేదూరి లక్ష్మయ్య, చేదూరి కిశోర్, మల్లెల వెంకటనారాయణ పాల్గొన్నారు.
Updated Date - Jun 09 , 2025 | 11:02 PM