ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా విజయానికి ఏడాది

ABN, Publish Date - Jun 04 , 2025 | 02:27 AM

కూటమికి ప్రజలిచ్చిన విజయానికి బుధవారంతో ఏడాది పూర్తవుతుంది. ‘వైనాట్‌ 175’ అంటూ నాడు అధికారంలో ఉన్న వైసీపీ నినాదాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కూటమికి లభించిన విజయంలో ఉమ్మడి జిల్లా ప్రజల పాత్ర గణనీయమైంది.

కొండపి నుంచి విజయం సాధించిన స్వామి ఆనందం (ఫైల్‌), ఒంగోలులో విజయం సాధించిన అనంతరం విక్టరీ సింబల్‌ చూపుతున్న జనార్దన్‌ (ఫైల్‌)

అక్రమ కేసులకు ఫుల్‌స్టాప్‌

నెలకొన్న రాజకీయ సుస్థిరత

భూ ఆక్రమణలకు అడ్డుకట్ట

నామినేటెడ్‌ పదవుల్లోనూ జిల్లాకు పెద్దపీట

కూటమికి ప్రజలిచ్చిన విజయానికి బుధవారంతో ఏడాది పూర్తవుతుంది. ‘వైనాట్‌ 175’ అంటూ నాడు అధికారంలో ఉన్న వైసీపీ నినాదాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కూటమికి లభించిన విజయంలో ఉమ్మడి జిల్లా ప్రజల పాత్ర గణనీయమైంది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది ఇదే రోజు. ఆ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు, జిల్లాతో సంబంధం ఉన్న రెండు పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీకి విజయం లభించింది. దీంతో ఆ గెలుపును, తదనంతర రాజకీయ పోకడలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

ఒంగోలు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని దర్శి, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వల్ప ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థులు గెలుపొందగా మిగిలిన అన్ని స్థానాలనూ టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. తదనంతరం ఉమ్మడి జిల్లాకు కూటమి ప్రభుత్వం కూడా ప్రాధాన్యమిచ్చి రెండు మంత్రి పదవులతోపాటు కొన్ని కార్పొరేషన్‌ పదవులను, కిందిస్థాయిలో పలు వురికి నామినేటెడ్‌ పోస్టులను ఇచ్చి రాజకీయంగా సముచిత గౌరవాన్ని అందించింది.

ఇటు సఫలం.. అటు విఫలం..

గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల వరకూ తెలుగుదేశం పార్టీ అనుసరిం చిన విధానం విజయవంతమైంది. వైసీపీ అనుసరించిన వ్యూహం విఫలమైంది. జిల్లాలో ఒకట్రెండు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అప్పటికే ప్రజలతో మమేకమై పనిచేస్తున్న అభ్యర్థులను టీడీపీ రంగంలోకి దింపింది. ఆ పార్టీ యంత్రాగాన్ని సమష్టిగా ముందుకు నడపడంలో సఫలీకృతమైంది. వైసీపీ అధినేత జగన్‌ విధానాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాగుంట శ్రీనివాసులరెడ్డిలాంటి వారిని కూడా అక్కున చేర్చుకుంది. ప్రజా సంబంధాలు ఉన్నా నాయకులను దూరం చేసుకోవడంతోపాటు అభ్యర్థుల ఎంపికలో వైసీపీ అనుసరించిన బదిలీల బంతాట కూడా ఆ పార్టీకి శాపంగా మారింది. వీటికి తోడు గత వైసీపీ ప్రభుత్వంలో కొనసాగిన ప్రజా వ్యతిరేక విధానాలు, ఇతర అంశాలపై ప్రజల్లో పెల్లుబికిన అసంతృప్తి టీడీపీ విజయానికి భారీగా దోహదపడ్డాయి.

ప్రశాంత వాతావరణం

ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితులను సమీక్షిస్తే రాజకీయంగా జిల్లాలో ప్రశాంత వాతావరణానికి ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీ నాంది పలికిందని చెప్పవచ్చు. గత ప్రభుత్వంలో అనుసరించిన కక్షసాధింపు చర్యలకు టీడీపీ పాలకులు దాదాపుగా దూరంగా ఉన్నారు. ఉదాహరణకు మొత్తం వ్యాపారవర్గాల వారిని గత ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేసిన విషయం తెలిసిందే. టీడీపీలో ఉన్న నాయకుల వ్యాపారాలు మూత వేయించడంతోపాటు కిందిస్థాయి వరకు పరిశ్రమ అనుబంధ వ్యాపారులను భారీగా ఇబ్బందులకు గురిచేశారు. వీటితో పాటు కిందిస్థాయిలో ప్రత్యర్థి పక్షంలో ఉన్న నాయకుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం ముమ్మరంగా జరిగాయి. జిల్లా,నియోజకవర్గ, గ్రామ, స్థాయి వరకు రాజకీయాన్ని దౌర్జన్యంగా శాసించే చర్యలు ముమ్మరంగా జరిగాయి. అక్రమ కేసులు మితిమీరిన విషయం తెలిసిందే. ఇంకో వైపు భూఆక్రమణలు విచ్చలవిడిగా సాగాయి. మార్కాపురం డివిజన్‌లో భూ ఆక్రమణల విషయంలో 14మందికిపైగా ఉద్యోగులు సస్పెండ్‌ కావడం, ఒంగోలులో జరిగిన భూఆక్రమణపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రావడం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాంటి అన్ని వ్యవహారాలు అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో జరిగిన విషయం జగమెరిగిన సత్యం. అయితే గత ఏడాదిలో ప్రస్తుత టీడీపీ పాలకుల పరిస్థితి పరిశీలిస్తే అలాంటి అరాచకాలకు పుల్‌స్టాప్‌ పడింది. గతంలో సామాన్యుడు ఇసుక కూడా దొరక్క విలవిల్లాడితే ప్రస్తుతం ఆ మాటే లేకుండా పాలన సాగుతుంది.

రాజకీయ సుస్థిరత

జిల్లాలో రాజకీయంగా స్థిరత్వ పరిస్థితులు నెలకొన్నాయి. మఖ్యంగా టీడీపీ జిల్లాలోనే ఆ పార్టీ నాయకత్వాన్ని ఐక్యంగా ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతమైంది. అధినాయకుల సూచనలకనుగుణంగా జిల్లా నాయకులు కూడా నడుచుకో గలుగుతున్నారు. ఫలితంగానే పదవుల కేటాయింపుల్లో అలకలు, లుకలుకలు కనిపించలేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవుల దక్కాయి, కూటమిలోని మూడు పార్టీల నుంచి ఆగురుగురికి కార్పొరేషన్‌ పదవులు దక్కాయి. ఇక డైరెక్టర్‌ పదవులైతే కోకొల్లలు. ఈ పదవులు పంపిణీలో చిన్నపాటి అసంతృప్తులు గానీ, అలకలు గానీ బయటపడలేదంటే కూటమిలో రాజకీయ సుస్థిరత ఎలా బలపడిందో అర్థం చేసుకోసుకోవచ్చు. అలాగే ఫిరాయింపులకు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం విశేషం. వైసీపీలోని కొందరు మాజీలు కూటమి వైపు చూసిన ప్రధానంగా టీడీపీ చాలామందికి అవకాశం ఇవ్వలేదు. మాజీ మంత్రి బాలినేనిని మాత్రం జనసేన చేర్చుకోగా, పరిస్థితి అయితే ఇంకా కుదుటపడలేదు. కార్పొరేషన్‌, మునిసిపాల్టీల్లో అభివృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ పాగా వేసింది.

కొన్ని విషయాల్లో...

కాగా అక్రమ కేసులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు లాంటి చర్యలకు పులిస్టాప్‌ పెట్టిన కొన్ని అంశాల్లో టీడీపీ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువమంది విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ధిష్ట విధానాలతో ముందుకు సాగడం వలన ఇసుక విధానంలో ప్రజా ప్రతినిధుల జోక్యం తగ్గిందని చెప్పవచ్చు. అయితే గ్రావెల్‌, రేషన్‌ బియ్యంలాంటి విషయాల్లో కొందరిపై విమర్శలు వచ్చాయి. లిక్కర్‌ విధానాన్ని మార్చిన ప్రభుత్వం చర్యలకు మద్యంప్రియులు జేజేలు పలుకుతున్నారు. అయితే వ్యాపారంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jun 04 , 2025 | 02:36 AM