సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:29 AM
దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్‌తో పా టు రెండవ పార్లమెంట్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు.
విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ డిమాండ్
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్‌తో పా టు రెండవ పార్లమెంట్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. స్థానిక సంతపేట లోని సంఘ కార్యాలయంలో గురువారం ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో రెండవ పార్లమెంట్‌ను ఏర్పాటు చేసి శీతాకాల సమావే శాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల న్నారు. ఆర్‌బీఐ అనుబంధ బ్యాంకులలో సిబిల్ స్కోర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చే శారు. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ పేరుతో జాతీయసహకార బ్యాంకును ఏర్పాటు చేయాల ని కోరారు. దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీతో పాటు దేశ రెండవ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రకటించాలని కోరారు. అందుకోసం వి ద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ద ళిత జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు రెబ్బవరపు ప్రే మ్‌కుమార్, ఉపాధ్యక్షుడు బత్తుల సుబ్బయ్య, అంబేడ్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్, జే ఏసీ నాయకులు కొమ్ము రాజీవ్, సూర్యసాగర్, కృష్ణ, బెంజిమెన్, ఈస్టర్ పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 12:29 AM