ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సముచిత స్థానం

ABN, Publish Date - Apr 21 , 2025 | 11:20 PM

కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. సోమవారం మండలంలోని చవిటిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించిన ఎన్టీఆర్‌ పార్కు, వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు.

చవిటిపాలెంలో ఎన్టీఆర్‌ పార్క్‌ను ప్రారంభిస్తున్న మంత్రి గొట్టిపాటి

అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

సంతమాగులూరు ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. సోమవారం మండలంలోని చవిటిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించిన ఎన్టీఆర్‌ పార్కు, వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అలాగే రూ.30లక్షలతో వేసిన సీసీ రోడ్లు, రూ.78.17లక్షల ఖర్చుతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తరగతి గదులను మం త్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి రవికుమార్‌ మాట్లాడుతూ జగన్‌రెడ్డి మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టి ఉపాధ్యాయ వృత్తిని అవమానించి వారిని మానసిక క్షోభకు గురి చేశారన్నారు. యువతకు ఇ చ్చిన మాట ప్రకారం డీఎస్సీతో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు అత్యధిక సార్లు డీ ఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. మంత్రి లోకేష్‌ నాయకత్వంలో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ తేలప్రోలు రమేష్‌, చేవూరి వాసురెడ్డి, తహసీల్దార్‌ కే రవిబాబు, ఎంఈవో వీ కోటేశ్వరరావు, ప్రణతి, కోమటినేని శ్రీనివాసరావు, పంచాయతీరాజ్‌ అధికారులు, గ్రామ సర్పంచి వల్లెపు వీరాంజనేయులు, మాజీ సర్పంచి గూళ్ల ఏడుకొండలు, టీడీపీ గ్రామ నాయకులు గంజి శ్రీను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డేవిడ్‌, డ్రిల్‌ మాస్టర్‌ కృష్ణారెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 11:20 PM