ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి జయంతి

ABN, Publish Date - May 11 , 2025 | 11:28 PM

పట్టణ సమీపంలోని కేటీఆర్‌ టెక్నోస్కూల్‌ ప్రాంగణంలో కొలువైఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత స్వామి వారికి పంచామృత అభిషేకం వైభవంగా నిర్వహించారు.

డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ఎంపికయిన శ్యామల కాశిరెడ్డికి స్వీట్లు తినిపిస్లున్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి

పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, మే 11 (ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలోని కేటీఆర్‌ టెక్నోస్కూల్‌ ప్రాంగణంలో కొలువైఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత స్వామి వారికి పంచామృత అభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం దేవవాలయం చైర్మన్‌ కుందురు తిరుపతిరెడ్డి దంపతులు లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం నిర్వహించారు. స్వామి వారికి శాంతి కల్యాణం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పాల్గొని లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రను దేవాలయం చైర్మన్‌ కేటీఆర్‌ ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే తండ్రి నర్సారెడ్డి పూజలు చేశారు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దద్దాల నారాయణ స్వామి కూడ పూజలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు శ్యామల కాశిరెడ్డి, జడ్పీటీసీ కస్తూరిరెడ్డి, ఎంపీపీ ప్రకాశం, సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎస్‌టీఆర్‌), మారుతి, బాబా దేవస్థానం చైర్మన్‌ సత్యాలు, ఉప్పాల నరసింహారావు, ముచ్చర్ల ధర్మారావు, సింగరాజు మాలకొండేశ్వరరావు, మాకినేని సాయిరాం, కంబాలదిన్నె శ్రీనివాసులు, ఉప్పాల సుబ్బారావు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో కనిగిరి నలుమూలల నుంచి అశేషంగా భక్తులు తరలివచ్చి పూజా కార్యాక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

వెలిగండ్ల మండలానికి దక్కిన డీసీఎంఎస్‌ పదవి

వెలిగండ్ల, మే 11 (ఆంధ్రజ్యోతి): డీసీఎంఎస్‌ చైర్మన్‌గా మండలంలోని వెదుళ్ళచెరువుకు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు శ్యామల కాశిరెడ్డి నియమితులయ్యారు. గత 20 సంవత్సరాలనుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. తన తండ్రి శ్యామల వెంకటరెడ్డి పేరు మీద ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి ఆయన అందించిన సేవలకుగాను డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవి దక్కింది. తనకు పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. వెలిగండ్ల మండల పార్టీ నాయకలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

Updated Date - May 11 , 2025 | 11:28 PM