ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పట్టణాభివృద్ధికి పక్కా ప్రణాళిక

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:24 PM

గిద్దలూరు మున్సిపాలిటీ అభివృద్ధికి పక్కాప్రణాళికతో ముందుకు పోతున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలుగా సహకరించనున్నారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు.

మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

సీఎం చంద్రబాబు హామీ

గిద్దలూరు టౌన్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): గిద్దలూరు మున్సిపాలిటీ అభివృద్ధికి పక్కాప్రణాళికతో ముందుకు పోతున్నామని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలుగా సహకరించనున్నారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణానికి శాశ్వత మంచినీటి పరిష్కారం కొరకు చోళ్లవీడు సమీపంలో గల రామన్నకతువ నుంచి గిద్దలూరు పట్టణానికి నీటిని అందించేందుకు సుమారు రూ.170కోట్ల ప్రభుత్వం నిధులు కేటాయించనున్నదని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించినట్లు తెలిపారు. తద్వారా పట్టణంలో నీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. రూ.38 కోట్లతో పట్టణంలోని సగిలేరువాగుకు రివిట్‌మెంట్‌ వాల్‌ నిర్మించనున్నట్లు, అంతేకాక నీటి నిలువ, భూగర్భజలాల పెంపు కోసం చెక్‌డ్యాంల నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేసేందుకు హామీ ఇచ్చినట్లు సమావేశంలో ఎమ్మెల్యే తెలిపారు. అంతేకాక పట్టణాభివృద్ధి కోసం అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, కమిషనర్‌ రమణబాబు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పండి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
4న మంత్రి గొట్టిపాటి పర్యటన

గిద్దలూరు టౌన్‌ : సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను శ్రేణులు ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో 6 మండలాల ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన అబివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు జూలై 2న శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ప్రతి టీడీపీ కార్యకర్త పాల్గొనాలన్నారు. అలాగే ప్రతిపక్షం చేసే తప్పుడు ప్రచారాలు కూడా తిప్పి కొట్టాలన్నారు. 4వ తేదీన విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, బోనేని వెంకటేశ్వర్లు, కే యోగానంద్‌, మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, ఆంజనేయులు, షానేషావలి, టీడీపీ నాయకులు పూనూరి భూపాల్‌రెడ్డి, కేతం శ్రీను, బైలడుగు బాలయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:24 PM