ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘నిలువు దోపిడీ’కి చెక్‌

ABN, Publish Date - Jul 27 , 2025 | 02:09 AM

పొగాకు వేలం కేంద్రాల్లో వ్యాపారులు, గుమస్తాల చేతివాటానికి చెక్‌పడింది. వారి వసూళ్ల పర్వం నిలిచిపోయింది. కొండపి వేలం కేంద్రంలో పొగాకు కొను గోలుకు రైతుల నుంచి భారీ మొత్తంలో దండుకుంటున్న వైనంపై ‘నిలువు దోపిడీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో శనివారం ప్రచురితమైన కథనం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

రైతులతో సమావేశంలో మాట్లాడుతున్న బోర్డు కార్యదర్శి వేణుగోపాల్‌, పక్కన ఆర్‌ఎం రామారావు

పొగాకు వేలం కేంద్రాల్లో నిలిచిన అక్రమ వసూళ్లు

కొండపిలో కొనుగోళ్లను పరిశీలించిన బోర్డు కార్యదర్శి, ఆర్‌ఎం

రైతులు, వ్యాపారులతో వేర్వేరుగా సమావేశం

తమ పొట్టకొడుతున్నారని కర్షకుల ఆవేదన

కట్టడికి అధికారుల హామీ

కొండపి, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : పొగాకు వేలం కేంద్రాల్లో వ్యాపారులు, గుమస్తాల చేతివాటానికి చెక్‌పడింది. వారి వసూళ్ల పర్వం నిలిచిపోయింది. కొండపి వేలం కేంద్రంలో పొగాకు కొను గోలుకు రైతుల నుంచి భారీ మొత్తంలో దండుకుంటున్న వైనంపై ‘నిలువు దోపిడీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో శనివారం ప్రచురితమైన కథనం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పొగాకు రైతులు, రైతు నాయకుల్లో ఇదే అంశం చర్చనీయాంశమైంది. ఈనేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు బోర్డు అధికారులు ఉపక్రమించారు. అన్ని వేలం కేంద్రాల్లోనూ ఈ వ్యవహారం సాగుతు న్నట్లు గుర్తించి తాత్కాలి కంగా ఫుల్‌స్టాప్‌ పెట్టారు. గుంటూరు పొగాకు బోర్డు కార్యదర్శి దివి వేణుగోపాల్‌, ఒంగోలు ఆర్‌ఎం రామా రావు శనివారం ఉదయం కొండపి వేలం కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడారు. వేలం కేంద్రంలో వ్యాపారులు, గుమస్తాలు డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని పలువురు వారి దృష్టికి తీసుకెళ్లారు.

ఎవ్వరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు : బోర్డు కార్యదర్శి

రైతులు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని పొగాకు బోర్డు కార్యదర్శి దివి వేణుగోపాల్‌ సూచించారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రైతులతో సమావేశం అనంతరం పొగాకు కంపెనీల ప్రతినిధులు, గుమస్తాలతో అధికారులు భేటీ అయ్యారు. సమావేశంలో బోర్డు విజిలెన్స్‌ అధికారి రవికాంత్‌ పాల్గొన్నారు. వేలం నిర్వహణకు ముందు ఒంగోలు ఆర్‌ఎం రామారావు రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని రకాల బేళ్లను వేలా నికి తీసుకువస్తేనే న్యాయం జరుగుతుం దని సూచించారు. అందరూ లోగ్రేడ్‌లు తీసుకు వస్తే వాటిలో ఎంపిక చేసిన బేళ్లను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తారన్నారు. మేలు, లోగ్రేడ్‌ రకాలను వేలానికి ఉంచితే వ్యాపారుల మధ్య పోటీ పెరుగుతుందని చెప్పారు.

Updated Date - Jul 27 , 2025 | 02:09 AM