బైక్‌ను వెనుక నుంచి ఢీకొన్న కారు
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:06 AM
జాతీయ రహదారిపై మార్టూరు మండల పరిధిలో కోలలపూడి క్రాస్ రోడ్డు వద్ద ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొన్న సంఘటన మంగళవారం జరిగింది.
బీటెక్ విద్యార్థి మృతి, మరో యువకుడికి గాయాలు
మార్టూరు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై మార్టూరు మండల పరిధిలో కోలలపూడి క్రాస్ రోడ్డు వద్ద ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొన్న సంఘటన మంగళవారం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న గుంటుపల్లి భరణ్(19) తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న మరో యువకుడు నల్లిబోయిన ప్రవీణ్ గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో భరణ్ చనిపోయాడు. మృతుడు పల్నాడు జిల్లా మేడికొండూరు మండలం, డోకిపర్రు గ్రామానికి చెందిన వాడు. అతడు తన స్నేహితుడు ప్రవీణ్‌తో కలిసి ఒంగోలులో ఒక కాలేజీలో బీటెక్ పస్ట్ ఈయర్ ఫీజు కట్టి వస్తున్నాడు. ఒంగోలు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామానికి చెందిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భరణ్ మృతదేహాం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. అదేవిధంగా ప్రవీణ్‌కు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మార్టూరు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Updated Date - Apr 30 , 2025 | 12:06 AM