ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తప్పుల తడక

ABN, Publish Date - May 04 , 2025 | 01:31 AM

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాలు తప్పులతడకగా ఉండటంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు భగ్గుమన్నారు. స్థానిక సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో శనివారం డీఈవో కిరణ్‌కుమార్‌ ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం నిర్వహించారు.

సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు

భగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు

సరిచేస్తామన్న డీఈవో కిరణ్‌కుమార్‌

ఒంగోలువిద్య, మే 3 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాలు తప్పులతడకగా ఉండటంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు భగ్గుమన్నారు. స్థానిక సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో శనివారం డీఈవో కిరణ్‌కుమార్‌ ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం నిర్వహించారు. అందులో టీచర్ల ఉద్యోగోన్న తులకు సంబంధించిన సీనియారిటీ జాబితాలు, 117 జీవోకు ప్రత్యామ్నాయంగా పాఠశాలల పునర్విభజన, ఉపాధ్యా యుల కేటాయింపుపై చర్చించారు. మొదటగా ఉద్యోగోన్నతు లకు సంబంధించిన టీచర్ల సీనియారిటీ జాబితాలోని తప్పులపై డీఈవోను ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నించారు. నెల రోజులుగా ప్రక్రియ కొనసాగుతున్నా తప్పులు లేకుండా జాబితాలను ప్రకటించలేకపోయారని ఆక్షేపించారు. స్కూలు అసిస్టెంట్లను హెచ్‌ఎం ప్రమోషన్లకు తయారుచేసిన జాబితాపై అభ్యంతరాలు తెలిపారు. డీఎస్సీ 1994 పేర్ల మధ్య డీఎస్సీ 96 పేర్లను చేర్చడం ఏమిటని ప్రశ్నించారు. మార్కాపురం మునిసిపాలిటీలోని సోషల్‌ స్టడీస్‌ స్కూలు అసిస్టెంట్‌ సీనియారిటీ జాబితాలో అసంబద్ధాలను నాయకులు డీఈవో దృష్టికి తెచ్చారు. 2009లో స్కూలు అసిస్టెంట్‌ ఇంగ్లీషు ప్రమోషన్‌ పొందిన టీచర్ల సీనియారిటీ జాబితాలోని లోపాలను కూడా ప్రస్తావించారు. దీనిపై డీఈవో స్పందిస్తూ జాబితాల్లోని తప్పులన్నింటినీ సరిచేస్తామని, సీనియారిటీ విషయంలో వివాదం ఉన్న విషయాలపై పాఠశాల విద్యా కమిషనర్‌ నుంచి వివరణ తీసుకొని జాబితాలను పారదర్శకంగా రూపొందిస్తా మని హామీ ఇచ్చారు.

వైద్య ధ్రువీకరణ పత్రాలకు మరో అవకాశం ఇవ్వాలి

టీచర్ల బదిలీల్లో ప్రాధాన్యత కేటగిరీలో బదిలీ పొందేందుకు వైద్య ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు మరో అవకాశం ఇవ్వాలని డీఈవోను ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఉర్దూ మీడియం పాఠశాలల విషయంలో విద్యార్థులకు అన్యాయం జరగకుండా టీచర్లను కేటాయించాలని కోరారు. సమావేశంలో విద్యాశాఖ ఏడీలు ఉదయ భాస్కర్‌, వరప్రసాద్‌, యూటీఎఫ్‌ నాయకులు శ్రీనివాసరావు, షేక్‌అబ్దుల్‌, లక్ష్మీనా రాయణ, ఏపీటీఎఫ్‌ నాయకులు జనార్దన్‌రెడ్డి, డి.శ్రీనివాసులు, వీవీ సుబ్బారావు, పీఆర్‌టీ యూ నాయకులు పులి శ్రీనివాసరావు, ఎస్‌టీ యూ నాయకులు చల్లా శ్రీనివాసులు, నరసిం హారెడ్డి, టీఎన్‌యూఎస్‌ నుంచి ఆంజనేయులు, బీటీఏ నుంచి వెంకట్రావు, పండిట్‌ పరిషత్‌ నుంచి రఘు తదితరులు పాల్గొన్నారు.


ఎంటీఎస్‌ టీచర్లకు చుక్కెదురు

కాంట్రాక్టు విధానంలో మినిమం టైం స్కేలు (ఎంటీఎస్‌)తో పనిచేస్తున్న డీఎస్సీ-98 టీచర్లకు తమ నివాసాలకు సమీపంలో పోస్టింగ్‌ల విషయంలో చుక్కెదురైంది. వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ పాఠశాల విద్య కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఎంటీఎస్‌ టీచర్లకు హెచ్‌ఆర్‌ఏ, డీఏలు ఇవ్వరు. కేవలం మూల వేతనం(బేసిక్‌)తో పనిచేయాలి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని 2023లో వారిని వారి నివాసాలకు సమీపంలోని పాఠశాలల్లో నియమించాలని అప్పటి పాఠ శాల విద్య కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. 2024-25లో వీరిని మళ్లీ విధుల్లోకి తీసుకునేటప్పుడు ఈ నిబంధనను పాటించలేదు. ఈనేపథ్యంలో తమ నివాసాలకు సమీపంలో నియమించాలని కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంటీఎస్‌ టీచర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం వీరిని ఉద్య్గోగాల నుంచి తొలగించామని, పునర్నియామకంలో వీరి అభ్యర్థనను పాటించడం సాధ్యం కాదని కమిషనర్‌ తాగా జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - May 04 , 2025 | 01:31 AM