ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యారంగానికి పెద్దపీట

ABN, Publish Date - Jun 12 , 2025 | 11:17 PM

కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి పెద్దపీఠ వేస్తున్నామని మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న మంత్రి స్వామి

మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

మూలగుంటపాడు హైస్కూల్‌లో మధ్యాహ్న పథకం ప్రారంభం

సింగరాయకొండ, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి పెద్దపీఠ వేస్తున్నామని మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. మండలంలోని మూలగుంటపాడు ప్రభుత్వహైస్కూల్‌లో గురువారం సన్నబియ్యం మధ్యాహ్న భోజన పఽథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా స్వామి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో విలువలతో కూడిన విద్యతోపాటు నాణ్యమై భోజనాన్ని అందజేయడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడతామని దొడ్డుబియ్యంతో పెట్టారని విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్‌ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతశాతం పెరిగిందన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం ముందే ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ బి. రవి, ఏంఈవో శ్రీనివాసులు, హెచ్‌ఎం హరేరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 11:17 PM