ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వేడుకగా 16 రోజుల పండుగ

ABN, Publish Date - Apr 29 , 2025 | 10:38 PM

మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల అనంతరం మంగళవారం ఆలయంలో చెన్నకేశవునికి 16 రోజుల పండుగ వేడుకగా భక్తిశ్రద్ధలతో భక్తజనరంజకంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అ లంకరించి విశేష పూజలు నిర్వహించారు.

పదహారు రోజుల పండుగ వేడుకలో ఉభయదేవేరులతో చెన్నయ్య

ముగిసిన చెన్నయ్య కల్యాణ వేడుకలు

మార్కాపురం వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల అనంతరం మంగళవారం ఆలయంలో చెన్నకేశవునికి 16 రోజుల పండుగ వేడుకగా భక్తిశ్రద్ధలతో భక్తజనరంజకంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యుల ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అ లంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మధ్యరంగ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవుని ఉత్సవ వరులను ప్రత్యేకంగా అలంకరించి 16 రోజుల పండుగ నిర్వహించారు. అరిసెలు భక్తులకు పంచిపెట్టారు. అనంతరం అమ్మవార్ల సారెలను ఘనంగా నిర్వహించారు. చెన్నకేశవ స్వామికి బ్రహ్మోత్సవాలు పంచారాత్రగమ సిద్ధాంతం ప్రకారం 12 రోజులు 12 వాహనాలపై 4 మాడవీధులలో నగరోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం 4 రోజుల పాటు వసంతోత్సవం, ఊంజల్‌ సేవ, మంగళవారం 16 రోజుల పండుగ నిర్వహించారు. దీంతో శ్రీలక్ష్మీ చెన్నకేశవుని కల్యాణ అనంతరం వేడుకలు ముగిశాయి. 16 రోజుల పండుగ కార్యక్రమంలో ఉభయదాతలుగా పాండురంగ మహిళా భక్త సమాజం వ్యవహరించారు. ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు యక్కలి కాశీవిశ్వనాథం, సభ్యులు, ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - Apr 29 , 2025 | 10:38 PM