ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లాకు కొత్తగా 5,174 పింఛన్లు మంజూరు

ABN, Publish Date - Jul 31 , 2025 | 11:42 PM

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద జిల్లాకు 5,174 కొత్త పింఛన్లను మంజూరు చేసింది. పింఛన్‌ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు వీటిని మంజూరు చేశారు.

2,84,966కు చేరిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు

వీటి పంపిణీకి రూ.124.982 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

నేడు లబ్ధిదారులకు సొమ్ము అందజేత

ఒంగోలు నగరం, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద జిల్లాకు 5,174 కొత్త పింఛన్లను మంజూరు చేసింది. పింఛన్‌ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు వీటిని మంజూరు చేశారు. 2019 నుంచి భర్త చనిపోయిన వారి భర్తలకు స్పౌజ్‌ కేటగిరీ కింద ప్రజా ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల సంఖ్య మొత్తం 2,84,900కి చేరాయి. గత వైసీపీ ప్రభుత్వం కుటుంబంలోని పెద్ద పింఛన్‌ పొందుతూ భర్త చనిపోతే ఆ కుటుంబంలోని వారికి పింఛన్‌ మంజూరు చేయలేదు. ఏళ్ళ తరబడి ఆ కుటుంబంలో అర్హులైనా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్‌ పొందుతున్న భర్త చనిపోతే ఆ కుటుంబంలో ఆ యన భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్‌ను మంజూరు చేస్తూ వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇలా పింఛన్లు పొందుతూ భర్తలు చనిపోతే ఇప్పటి వరకు పింఛన్‌లు మంజూరు కాని వారి వివరాలను ప్రభుత్వం సేకరించింది. విచారణ జరిపించి ఈ నెల నుంచి వారి పింఛన్‌ సొమ్ము రూ.4 వేల వంతును ముట్టజెప్పనుంది. 5,174 మంది భర్తలు చనిపోయిన వితంతువులకు పింఛన్‌ ఈ నెల 1వ తేదీన అందజేయనుంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి శుక్రవారం శింగరాయకొండ, జరుగుమల్లి మండలంలోని గ్రామంలో పింఛన్లను అందజేయనున్నారు. స్పౌజ్‌ కేటగిరీ కింద జిల్లాకు కొత్తగా మంజూరు చేసిన 5,174 మందికి శుక్రవారమే సచివాలయం సిబ్బంది పింఛన్లను పంపిణీ చేయనున్నారు.

జిల్లాలో 2,84,966కి చేరిన పింఛన్లు.. రూ.124.982 కోట్లు విడుదల

ఈ నె లలో కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసిన 5,174 స్పౌజ్‌ పింఛన్లను కలుపుకుని జిల్లాలో మొత్తం పింఛన్లు 2,84,966కి చేరాయి. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 1,48,948, వితంతు పింఛన్లు 73,728, దివ్యాంగుల పింఛన్లు 32,875, ఒంటరి మహిళ పింఛన్లు 7,735, చర్మకారులు 5,265, డప్పు కళాకారులు4,550, మత్స్యకారపింఛన్లు 2,467, చేనేత కార్మికులు 1745,కల్లుగీత కార్మికులు 241, హిజ్రాలు92, కళాకారుల పింఛన్లు 57 అభయహస్తం పింఛన్లు 4,710, దీర ్ఘకాలవ్యాధులతో బాడపడుతున్న వారి పింఛన్లు 2,004, మిగిలిన పింఛన్లు కలుపుకుని మొత్తం జిల్లాలో 2,84,966కి చేరాయి. ఈ పింఛన్లను జిల్లాలోని 5,673 సచివాలయ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం నుంచే పంపిణీ చేయనున్నారు.

Updated Date - Jul 31 , 2025 | 11:42 PM