సర్పంచ్‌కు 15.. వార్డులకు 39
ABN, Publish Date - Aug 02 , 2025 | 01:48 AM
కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు భారీగా దాఖలయ్యాయి. సర్పంచ్ పదవికి 15, మొత్తం 14 వార్డులకు 39 మంది నామినేషన్లు వేశారు.
కొండపి పంచాయతీకి చివరి రోజు భారీగా నామినేషన్లు
కొండపి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు భారీగా దాఖలయ్యాయి. సర్పంచ్ పదవికి 15, మొత్తం 14 వార్డులకు 39 మంది నామినేషన్లు వేశారు. అభ్యర్థుల నుంచి గ్రామ సచివాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె.రవికుమార్ నామినేషన్లను స్వీకరించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుందని రవికుమార్ తెలిపారు. కార్యక్రమాన్ని ఇన్‌చార్జి ఎంపీడీవో పి.రామకృష్ణ పర్యవేక్షించారు. రిటర్నింగ్ స్టేజ్-2 అధికారి బి.ప్రసాదరావు, ఈవోఆర్డీ అంజలీదేవి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నం రామ్మోహన్ పాల్గొన్నారు. సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వు కాగా 15 మంది నామినేషన్లు వేశారు. వీరిలో టీడీపీ మద్దతుదారులతోపాటు, వైసీపీ మద్దతుదారులు ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో ఒకరు నామినేషన్ వేశారు. సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేసిన వారిలో పందిటి కుమారి, యనమద్ని అరుణ, అల్లడి సుశీల, కొమ్ము మధులిక, కొమ్ము సుశీల, యనమద్ని పూజ, ఎదురు సురేఖ, యనమద్ని పద్మావతి, పల్లె మేరి, అడ్డగబొట్టు విమలమ్మ, యనమద్ని వసంత, యనమద్ని కొండమ్మ, యనమద్ని మౌనిక, యనమద్ని కల్యాణి, కొమ్ము సంధ్యారాణి ఉన్నారు.
Updated Date - Aug 02 , 2025 | 01:48 AM