ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీపీవో కార్యాలయ పరిధిలో 122మంది బదిలీ

ABN, Publish Date - Jun 11 , 2025 | 01:16 AM

జిల్లా పంచాయతీ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న 122మంది బదిలీ అయ్యారు. ఈమేరకు జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో తదనుగుణంగా ప్రక్రియను నిర్వహించారు.

డిప్యూటీ ఎంపీడీవోలు 16 మంది, సెక్రటరీలు 106 మందికి స్థానచలనం

ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా పంచాయతీ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న 122మంది బదిలీ అయ్యారు. ఈమేరకు జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో తదనుగుణంగా ప్రక్రియను నిర్వహించారు. ఐదేళ్లు ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులు తొమ్మిది మంది ఉండగా రిక్వెస్టు కింద 71మంది, పరిపాలన సౌలభ్యం కోసం మరో 29మందిని మార్చారు. అందులో ఇతర జిల్లాలకు 13మందిని బదిలీ చేశారు. డిప్యూటీ ఎంపీడీవోలు (ఈవోపీఆర్‌డీ) 16 మంది, గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శులు 20మంది, గ్రేడ్‌-2 పంచాయతీ కార్యదర్శులు ఇద్దరు, గ్రేడ్‌-3 పంచాయతీ కార్యదర్శులు 45మంది, గ్రేడ్‌-4 39మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో డిప్యూటీ ఎంపీడీవోలు ఎనిమిది మందిని, గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శులు ఇద్దరు, గ్రేడ్‌-3 కార్యదర్శులు ముగ్గురిని బాపట్ల, నెల్లూరు జిల్లాలకు పంపారు.

Updated Date - Jun 11 , 2025 | 01:18 AM