పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి టీజీ భరత్
ABN, Publish Date - Jul 06 , 2025 | 04:17 AM
పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగర పాలక కార్యాలయంలో శనివారం ‘స్వర్ణాంధ్ర-పీ4’పై సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కర్నూలు న్యూసిటీ, జూలై 5(ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగర పాలక కార్యాలయంలో శనివారం ‘స్వర్ణాంధ్ర-పీ4’పై సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వర్ణాంధ్ర-పీ4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు భరోసా లభిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు, లక్ష మంది మార్గదర్శులను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. బంగారు కుటుంబాలకు సరైన సమయంలో సహకారం, నిరంతర గైడెన్స్ ఇవ్వడం వంటి బాధ్యతలను మార్గదర్శులు తీసుకుంటారన్నారు. సీఎం చంద్రబాబు ముందు చూపు కలిగిన వ్యక్తి అని, ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని మంత్రి భరత్ అన్నారు.
Updated Date - Jul 06 , 2025 | 04:18 AM