Siraj ur Rehman: అరెస్టు చేసి ఉండకపోతే.. పేలుడే
ABN, Publish Date - May 22 , 2025 | 05:37 AM
విజయనగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రసానుభూతి పరుడు సిరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఈడీ బాంబులు సిద్ధం చేస్తూ పట్టుబడిన అతను, సోషల్ మీడియాలో పరిచయాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలవైపు మోజు చూపాడు.
అప్పటికే ఐఈడీ తయారీకి సిద్ధం
వాటితో తిరుగుతుండగా పట్టుకున్నాం
ఉగ్రసానుభూతి పరుడు సిరాజ్ రెహ్మాన్
ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెల్లడి
విజయనగరం, మే 21(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాకు చెందిన ఉగ్రవాద సానుభూతి పరుడు, నిషేధిత ఇస్లామిక్ స్టేట్(ఐఎ్‌స)తో సంబంధాలు పెట్టుకుని పేలుళ్లకు కుట్రపన్నిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు అరెస్టు చేసి ఉండకపోతే పేలుళ్లకు పాల్పడి ఉండేవారని స్పష్టమైంది. అది కూడా విజయనగరం జిల్లాలోని జనసమ్మర్థ ప్రాంతాన్ని అప్పటికే ఎంచుకున్నారని తెలిసింది. తాజాగా సిరాజ్‌కు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న పలు విషయాలు.. సిరాజ్.. తన స్నేహితుడు, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌తో కలిసి పన్నిన కుట్రను స్పష్టం చేస్తున్నాయి. విజయనగరం నడిబొడ్డున పేలుళ్లకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఉగ్ర సానుభూతిపరుడు సిరాజ్ ఉర్ రెహ్మన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తాజాగా తెలిసింది. పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్ల తయారీకి అవసరమైన పీవీసీ పైపుముక్కలు, ఇతర సామగ్రిని శనివారమే కొనుగోలు చేసి ఐఈడీ(ఇంప్రవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) తయారీకి సిద్ధమయ్యారు. ఈ సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. జనసమ్మర్థ ప్రాంతాల్లో ఐఈడీని పేల్చేందుకు పన్నాగం పన్నినట్టు విచారణలో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది ఇక, విజయనగరంలో ఇద్దరు వ్యాపారులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర సానుభూతిపరులు ఇచ్చిన సమాచారంతోనే వారిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. కన్యకాపరమేశ్వరి కోవెల ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యాపారులతో పాటు మరోవ్యక్తిని రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంక్ అకౌంట్లపై ఆరా
సిరాజ్‌తో పాటు కుటుంబసభ్యుల బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలని నగరంలో అన్ని బ్యాంకుల అధికారులకు సమాచారమిచ్చారు. మరోవైపు సిరాజ్‌తో పాటు కుటుంబ సభ్యులందరికీ డీసీసీబీ బ్యాంకులో అకౌంట్‌తో పాటు మరికొన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని తెలిసింది. సిరాజ్ తండ్రి(ఏఎ్‌సఐ) సోమ, మంగళవారాల్లో బ్యాంక్ లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. లాకర్‌ను తెరిచేందుకు మొదట యూనిఫారం లేకుండా వెళ్లారు. తర్వాత పోలీసు యూనిఫాంలో వెళ్లి బ్యాంకు వెళ్లి లాకర్ తెరిచేందుకు అనుమతి కోరారు. అయితే, అప్పటికే దర్యాప్తు అధికారుల ఆదేశాలు ఉండడంతో బ్యాంకు అధికారులు అనుమతించలేదు.
ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?
సిరాజ్ ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు. ఈ నెల 16న కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారుల సమాచారంతో విజయనగరం పోలీసులు విజ్జీ స్టేడియం సమీపంలో సిరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఓ సంచిలో పేలుడుకు వినియోగించే వస్తువులు, ల్యాప్‌టాప్, ఇతరత్రాసామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తనకు ఇన్‌స్టాలో పరిచయమైన వారిని కలిసేందుకు 2024, నవంబరు 22న ముంబైకి వెళ్లాడు. అంతకుముందు 2024, జనవరి 26న సహబాజ్, జీషాన్‌లను కలవడానికి ఢిల్లీ వెళ్లాడు. సౌదీలో ఉంటున్న బిహార్‌కు చెందిన అబూతాలమ్ అలియాస్ అబూముసాబ్ అనే వ్యక్తి సూచనతో తరచూ సిగ్నల్ యాప్ ద్వారా జిహాదీ కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఐఈడీ బాంబులను తయారు చేసి ముందుగా విజయనగరంలో జనసమ్మర్థ ప్రాంతంలో పేల్చేందుకు నిర్ణయించుకున్నామని వెల్లడించాడు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 05:37 AM