ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోలవరం గట్టు గుట్టు.. గప్‌చుప్‌!

ABN, Publish Date - May 26 , 2025 | 12:56 AM

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పోలవరం మట్టి తవ్వకాల్లో గుట్టు తేలట్లేదు. 2.02 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వగా, ప్రభుత్వ అవసరాలకు 28.88 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వుకోవటానికి అనుమతించారు. ఇంకా 1.74 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి ఉండాల్సి ఉండగా, వాటి లెక్కలు తేలట్లేదు. పోలవరం కాల్వగట్టు తవ్వినపుడు మట్టి ఎంత వచ్చింది? ప్రభుత్వ అవసరాలకు అధికారికంగా తవ్వకాలకు ఎంత అనుమతించింది? వివరాలు రికార్డుల్లో ఉన్నాయి. ప్రైవేట్‌ వ్యక్తులకు మాత్రం అధికారికంగా ఎక్కడా అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు? మరి మట్టి గుట్టలు ఎలా కరిగిపోయాయి? ఎవరు కరిగించుకుపోయారన్నది తెలియదట. ఇదీ ఘనత వహించిన జలవనరుల శాఖ అధికారుల నిర్వాకం. ప్రభుత్వ అవసరాలకు ఇచ్చింది పోను క్షేత్రస్థాయిలో ఇంకా ఎంత మట్టి ఉందంటే, ముళ్ల కంపలు పెరిగిపోవటం వల్ల అంచనా వేయలేకపోతున్నామని చెబుతున్నారు. ముళ్ల కంపలు ఉంటే మట్టి గుట్టలను అంచనా వేయలేరా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

- 1.74 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పోలవరం మట్టి ఏమైంది?

- మట్టి ఎంత ఉందో తెలియదని అధికారుల దాటవేత

- సమాచార హక్కు దరఖాస్తుకు ఇరిగేషన్‌ అధికారుల స్పందన

- విజిలెన్స్‌ విభాగానికి కూడా కట్టుకథలతో లెక్కలు చెప్పారా?

- పోలవరం కుడిగట్టులో మొత్తం 2.02 కోట్ల క్యూబిక్‌ మీటర్ల నిల్వలు

- ప్రభుత్వ అవసరాల కోసం ఇచ్చింది 28.89 లక్షల క్యూబిక్‌ మీటర్లు

- మిగిలిన 1.74 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి ఏమైంది?

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పోలవరం మట్టి తవ్వకాల్లో గుట్టు తేలట్లేదు. 2.02 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వగా, ప్రభుత్వ అవసరాలకు 28.88 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వుకోవటానికి అనుమతించారు. ఇంకా 1.74 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి ఉండాల్సి ఉండగా, వాటి లెక్కలు తేలట్లేదు. పోలవరం కాల్వగట్టు తవ్వినపుడు మట్టి ఎంత వచ్చింది? ప్రభుత్వ అవసరాలకు అధికారికంగా తవ్వకాలకు ఎంత అనుమతించింది? వివరాలు రికార్డుల్లో ఉన్నాయి. ప్రైవేట్‌ వ్యక్తులకు మాత్రం అధికారికంగా ఎక్కడా అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు? మరి మట్టి గుట్టలు ఎలా కరిగిపోయాయి? ఎవరు కరిగించుకుపోయారన్నది తెలియదట. ఇదీ ఘనత వహించిన జలవనరుల శాఖ అధికారుల నిర్వాకం. ప్రభుత్వ అవసరాలకు ఇచ్చింది పోను క్షేత్రస్థాయిలో ఇంకా ఎంత మట్టి ఉందంటే, ముళ్ల కంపలు పెరిగిపోవటం వల్ల అంచనా వేయలేకపోతున్నామని చెబుతున్నారు. ముళ్ల కంపలు ఉంటే మట్టి గుట్టలను అంచనా వేయలేరా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

పోలవరం కుడికాల్వపై ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల పరిధిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్‌ మాఫియా గుట్టలను కరిగించేసి చదును చేసేసింది. గన్నవరం, నున్న, విజయవాడ, వెలగలేరు సబ్‌ డివిజన్ల పరిధిలో అడ్డగోలుగా ఈ తవ్వకాలు జరిగాయి. అప్పటి అక్రమ మట్టి తవ్వకాలకు జలవనరుల శాఖ అధికారులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలవరం మట్టి తవ్వకాలకు సంబంధించి ఇటీవల విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు జరిపారు. ఇరిగేషన్‌ అధికారులను వివరణ కోరారు. గతంలో జరిగిన అక్రమాల పాపంలో తాము కూడా భాగస్వాములుగా ఉండటంతో ఇరిగేషన్‌ అధికారుల వెన్నులో వణుకు పుడుతోంది. దీంతో వాస్తవాలను దాచేస్తున్నారు. విజిలెన్స్‌కు కూడా అరకొర సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వారికి కూడా అక్ర మ తవ్వకాలపై కనీస సమాచారం ఇవ్వట్లేదు. దీంతో జలవనరుల శాఖ అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుయాయులు సాగించిన పోలవరం మట్టి దందాను ఏమీ లేదన్నట్టుగా తేల్చేస్తున్నారు. విజయవాడ రూరల్‌ మండలానికి చెందిన మెండెం జమలయ్య సమాచార హక్కు చట్టం ద్వారా సంధించిన ప్రశ్నలకు ఇరిగేషన్‌ అధికారులకు వాస్తవాలను దాచేసి అరకొర సమాచారం ఇచ్చారు.

గన్నవరంలో కరిగించేసిన మట్టి ఎంత?

గన్నవరం నియోజకవర్గ పరిధిలో పోలవరం కాల్వ గట్టును పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అనుయాయులు కరిగించేశారు. ఈ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఇచ్చిన సమాధానం మేరకు చూస్తే.. 2015 నుంచి 2019 వరకు పోలవరం కాల్వ తవ్వకాలకు సంబంఽధించి మొత్తంగా 58,45,266 క్యూబిక్‌ మీటర్ల మట్టి వచ్చింది. ఈ మట్టిని కాల్వకు రెండు వైపులా గుట్టలుగా పోశారు. ఇందులో 3,33,999 క్యూబిక్‌ మీటర్ల మేర ప్రభుత్వ శాఖల అవసరాల కోసం కేటాయించారు. దీని ప్రకారం చూస్తే మరో 55 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి ఉండాలి. ఎంత మట్టి ఉందో తెలియదని సమాధానం ఇచ్చారు. మిగిలిన మట్టికి సంబంధించి లెక్కలు ఎందుకు చెప్పలేకపోతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. గన్నవరంలో కొద్దిచోట్ల తప్ప దాదాపు పోలవరం మట్టి తరలింపునకు గురైంది. ఎంత మట్టి ఉందో కనీసం ఇప్పటికీ ఇరిగేషన్‌ అధికారులు సర్వే చేసి లెక్కలు తీయకపోవటం గమనార్హం.

జక్కంపూడి కొండ గ్రావెల్‌, మట్టి ఏమైందో తెలియదు

పోలవరం కుడి కాల్వ నిర్మాణ ం కోసం జక్కంపూడి దగ్గర కొండను తవ్వాల్సి వచ్చింది. 2015 - 2019 వరకు రికార్డుల్లో ఉన్న సమాచారం మేరకు 28,73,922 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇందులో 5,46,860 క్యూబిక్‌ మీటర్ల మేర ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించారు. పోనీ అధికారుల లెక్కనే చూస్తే మరో 23 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి ఏమైందో తెలియదు? క్షేత్రస్థాయిలో తట్టెడు గ్రావెల్‌ కూడా లేదు. ఎంత గ్రావెల్‌ ఉందో కూడా అధికారులు చెప్పట్లేదు.

మిగిలింది ఎంత?

ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల పరిధిలో పోలవరం కుడికాల్వకు సంబంధించి 2005-15, 2015-19 వరకు కాల్వ నిర్మాణ పనులు జరిగాయు. గన్నవరం సబ్‌ డివిజన్‌ పరిధిలో 2005 నుంచి 2014 వరకు ఎలాంటి కాల్వ తవ్వకాలు జరగలేదు. 2015 నుంచి 2019 వరకు 58,45,266 క్యూబిక్‌ మీటర్లు తవ్వి కాలువ ఒడ్డున నిల్వ చేశారు. ప్రభుత్వ అవసరాల కోసం 3,33,299 క్యూబిక్‌ మీటర్ల మట్టిని కేటాయించారు. ఇంకా 55,11,967 క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి ఉండాలి? ఎంత ఉందో లెక్క తెలియదట.

- నున్న సబ్‌ డివిజన్‌ పరిధిలో 2014 వరకు 53,67,162 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వి నిల్వ చేశారు. ఇందులో 12,71,685 క్యూబిక్‌ మీటర్ల మట్టిని ప్రభుత్వ శాఖలకు కేటాయించారు. పోగా 40,95,477 క్యూబిక్‌ మీటర్ల మట్టి ఏమైందో తెలియదట.

- విజయవాడ సబ్‌ డివిజన్‌ పరిధిలో 2014 వరకు 36,04,508 క్యూబిక్‌ మీటర్లు, 2019 నాటికి మరో 28,73,922 క్యూబిక్‌ మీటర్లు తవ్వి నిల్వ చేశారు. మొత్తంగా 64,78,430 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వగా, 10,58,114 క్యూబిక్‌ మీటర్ల మట్టిని ప్రభుత్వ శాఖలకు కేటాయించారు. పోగా 54,20,316 క్యూబిక్‌ మీటర్లకు లెక్క లేదు.

- వెలగలేరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఏఈ సెక్షన్‌ 1, 2, 3 పరిధిలో 25,84,821 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వి నిల్వ చేయగా, అందులో 2,25,197 క్యూబిక్‌ మీటర్ల మట్టిని ప్రభుత్వ అవసరాలకు కేటాయించారు. మిగిలిన 23,59,624 క్యూబిక్‌ మీటర్ల మట్టికి లెక్క లేదు.

మిగిలిన మట్టి ఏమైంది?

ఇరిగేషన్‌ శాఖ అధికారులు కేవలం ప్రభుత్వ శాఖల అవసరాలకు మట్టి ఇచ్చామని చెబుతున్న నేపథ్యంలో గన్నవరం, నున్న, విజయవాడ, వెలగలేరు సబ్‌ డివిజన్ల పరిధిలో 1.74 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి నిల్వలు ఉండాలి. ఇందులో ఎంత మట్టి ఉందో అధికారులు చెప్పట్లేదు. అదేమంటే మట్టి మీద కంప పెరిగింద, కుదరట్లేదని సమాధానం ఇస్తున్నారు.

రైతులు ఆక్రమించుకున్న వాటికి ఫిర్యాదులు చేశారట

పోలవరం కుడి కాల్వ గట్టు వెంబడి నిల్వ ఉంచిన మట్టి నిల్వలు ఏమై పోయాయో తెలియదు కానీ, కాల్వను ఆనుకుని ఉన్న భూ యజమానులు కాల్వల వెలుపల స్పాయిల్‌ బ్యాంకులు ఖాళీ ఉన్నచోట్ల కొన్ని ప్రదేశాల్లో నున్న సబ్‌ డివిజన్‌ పరిధిలో గొల్లనపల్లి, ముదిరాజుపాలెం, గోపవరపుగూడెం, సూరంపల్లి, నున్న గ్రామాల పరిధిలో మామిడి మొక్కలు నాటారని వాటిని ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చామని చెప్పారు. విజయవాడ సబ్‌ డివిజన్‌ పరిధిలో కూడా నున్న, పాతపాడు, పీ నైనవరం, జక్కంపూడి గ్రామాల్లోని కొన్ని ప్రదేశాలలో పై విధంగానే ఆక్రమణలు జరిగాయని తెలిపారు. ఈ విషయాలు తెలిసిన అధికారులకు మిగిలిన మట్టి నిల్వలు ఏమైపోయాయో తెలియకపోవటం గమనార్హం.

Updated Date - May 26 , 2025 | 12:56 AM