ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తాకట్టు.. కనికట్టు!

ABN, Publish Date - May 14 , 2025 | 01:22 AM

పర్యాటకాభివృద్ధి సంస్థలో ఉన్నతాధికారుల రూటే సపరేటుగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. లాభాల్లో ఉన్న హరిత బెర్మ్‌ పార్క్‌ను రూ.110 కోట్లకు ఓ బ్యాంకులో తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఆ తాకట్టులోని పర్యాటక యూనిట్లను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

-పర్యాటకాభివృద్ధి సంస్థ మాయాజాలం

- రూ.110 కోట్లకు హరిత బెర్మ్‌ పార్క్‌ తాకట్టు

- గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నతాధికారుల నిర్వాకం

- ఇప్పుడు ‘స్టెర్లింగ్‌ ’ సంస్థకు పర్యాటక యూనిట్లు కట్టబెట్టేందుకు యత్నం

- లాభాల్లోని యూనిట్లను ప్రైవేటుకు ఇవ్వకూడదన్న ఏపీటీడీసీ పాలకవర్గం

- అయినా వినని ఉన్నతాధికారులు.. అంతా గందరగోళం!

పర్యాటకాభివృద్ధి సంస్థలో ఉన్నతాధికారుల రూటే సపరేటుగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. లాభాల్లో ఉన్న హరిత బెర్మ్‌ పార్క్‌ను రూ.110 కోట్లకు ఓ బ్యాంకులో తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఆ తాకట్టులోని పర్యాటక యూనిట్లను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)లో తాకట్టు.. ఆపైన కనికట్టు వ్యవహారం నడుస్తోంది. వైసీపీ హయాంలో హరిత బెర్మ్‌ పార్క్‌ను తాకట్టు పెట్టి రూ.110 కోట్ల రుణ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఈ రుణాలతో పర్యాటక యూనిట్లలోని కాటేజీలు, రిసార్టుల రెన్నోవేషన్‌ చేపట్టారు. ఈ పనుల వ్యవహారంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం రాకతో కొలువుతీరిన ఏపీటీడీసీ బోర్డు వైసీపీ హయాంలో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ఒక్కో ఇటుక పేరుస్తుంటే.. ఉన్నతాధికారులు వాటికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. హరిత బెర్మ్‌పార్క్‌పై రూ.110 కోట్ల అప్పు తీసుకుని భవానీ ఐల్యాండ్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనిట్ల ఆధునీకరణ పనులు చేపట్టిన ఏపీటీడీసీ అధికారులు వీటిని గంపగుత్తగా ‘స్టెర్లింగ్‌’ అనే సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకు తనఖాలో ఉన్న ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అసలు కట్టబెట్టవచ్చా? ఆ ప్రైవేటు సంస్థ ఏ విధంగా తీసుకుంటుంది? అన్న అంశాలు తాజాగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇలాంటి వ్యవహారాల్లో అనేక న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేయాలన్న పేరుతో బ్యాంకు రుణంతో చేపట్టాల్సిన పనులను అర్ధంతరంగా ఏపీటీడీసీ ఉన్నతాధికారులు నిలుపుదల చేయించారు. దీంతో పర్యాటక యూనిట్లు ఆధునీకరణకు నోచుకోకుండా పోయాయి. దీని తర్వాత షాకింగ్‌ వార్తను ఏపీటీడీసీ అధికారులు అందుకున్నారు. అదేమిటంటే.. ఏ సంస్థకు అయితే కట్టబెట్టాలనుకుంటున్నారో.. ఆ సంస్థ భవానీ ద్వీపాన్ని, బెర్మ్‌ పార్క్‌ను పరిశీలించిన తర్వాత భవిష్యత్తులో భారీ వరద వస్తే తాము నష్టపోతామని వెనుకడుగు వేసింది. దీంతో షాక్‌కు గురైన ఏపీటీడీసీ అధికారులు ఆ సంస్థను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పించేందుకు రాయితీల వర్షం కురిపిస్తూ చర్చలు జరుపుతున్నారు.

ముందుగానే కమీషన్లు దండుకుని..

వైసీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటకాభివృద్ధికి నయా పైసా విదల్చలేదు. మీ చావు మీరు చావండన్నట్టు వ్యవహరించింది. దీంతో అప్పట్లో ఉన్న కొందరు ఉన్నతాధికారులు విచ్చలవిడి అవినీతికి తెరలేపారు. ప్రభుత్వం డబ్బులు ఇవ్వటంలేదన్న కారణంతో.. అవినీతి రుచి మరిగిన ఉన్నతాధికారులు బ్యాంకుల దగ్గర రుణం తీసుకుందామన్న ప్రతిపాదన తెచ్చారు. దీని కోసం విజయవాడలోని భవానీపురంలో కృష్ణానది వెంబడి ఉన్న హరింత బెర్మ్‌పార్క్‌ 5.50 ఎకరాల స్థలాన్ని రూ.110 కోట్లకు తాకట్టు పెట్టారు. ఈ డబ్బులతో ఏమి చేస్తారని బ్యాంకు ప్రశ్నించగా తమ పర్యాటక యూనిట్ల కాటేజీలను ఆఽధునీకరణ చేస్తామని, తద్వారా పర్యాటకుల ఆదరణ ద్వారా మరింత ఆదాయం వస్తుందని, ఆ ఆదాయంతో అప్పు తీర్చుతామని తెలిపింది. బ్యాంకు కూడా తెలివిగానే వ్యవహరించింది. గంపగుత్తగా డబ్బులు ఇవ్వకుండా ఆయా పర్యాటక యూనిట్ల వారీగా ఆధునీకరణ చేపడుతున్న కాంట్రాక్టర్లకు చేసిన పనిని బట్టి నేరుగా వారికే చెల్లింపులు చేస్తామని చెప్పింది. దీనికి అప్పటి ఏపీటీడీసీ ఉన్నతాధికారులు అంగీకరించారు. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎన్నికల ముందు హడావిడిగా కాంట్రాక్టర్లతో సమావేశం పెట్టి ముందుగానే పనులన్నింటికీ అప్పటి ఉన్నతాధికారులు కమీషన్లు దండుకున్నారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక .. బ్యాలెన్స్‌ పనులు ఆ తర్వాత వచ్చిన అధికారులు చేపట్టారు. కొంతకాలం నుంచి సడెన్‌గా పనులన్నింటినీ ఆపేశారు. దీంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. పనులు సగంలో ఆపివేశారని, తమ నుంచి కమీషన్లు మాత్రం ముందుగానే దండుకున్నారని, ఎంతో మెటీరియల్‌ ఖర్చు చేశామని, బిల్లులు చెల్లించకపోతే నష్టపోతామని అంటున్నారు.

ఎవరి ప్రయోజనం కోసం ఈ తాపత్రయం?

రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పర్యాటక శాఖను పర్యవేక్షించే ఓ ఉన్నతాధికారి త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈయన తన పదవీ విరమణ లోపు అద్భుతమైన ప్రాజెక్టులను చేపట్టానన్న పేరు కోసం పర్యాటక యూనిట్ల ప్రైవేటీకరణ విషయాన్ని తెర మీదకు తీసుకు వచ్చారు. ఇది కనుక సాకారమైతే.. ఆయనకు మరికొంత కాలం ఎక్స్‌టెన్షన్‌ లభించవచ్చన్నది ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.

సామాన్యులపై ధరల భారం ఉండకూడదన్న సీఎం

ఇటీవల పర్యాటక శాఖ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా కొందరు ఉన్నతాధికారులు పర్యాటక యూనిట్ల ప్రైవేటీకరణ అంశాన్ని తీసుకువచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించలేదు. ఆయా పర్యాటక యూనిట్ల పరిస్థితులను మదింపు చేసి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పేదలకు ధరల భారం ఉండే పరిస్థితి రాకూడదని కూడా స్పష్టం చేశారు. భారీ స్థాయిలో వచ్చేవి, బల్క్‌గా, కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల విషయంలో పీపీపీ విధానాలను అవలంభించాలని మొదటి నుంచి ఆయన చెబుతున్నారు. పర్యాటక పాలసీలో కూడా కేటగిరీల వారీగా ప్రోత్సాహకాలను వెలువరించారు. ఇంత స్పష్టంగా ఉన్నా కూడా పర్యాటక శాఖ అధికారులు తమ రూటే సెపరేటు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

తప్పులు సరిచేయకుండా.. ప్రైవేటీకరణ వల్ల ప్రయోజనమేమిటి ?

వైసీపీ హయాంలో చేసిన తప్పులను సరిచేయకుండా.. మళ్లీ అవే తప్పులకు ఉన్నతాధికారులు పాల్పడుతున్నారు. ఏపీటీడీసీ పాలకవర్గం ఈ దిశగా ఆలోచిస్తుంటే అందుకు భిన్నంగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. ఏపీటీడీసీ చైర్మన్‌ నూకసాని బాలాజీ ఈ అంశాలపై దృష్టి సారిస్తే.. ఉన్నతాధికారులు మాత్రం ఆయన ఆలోచనలే తప్పు అన్నట్టుగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీటీడీసీ పర్యాటక యూనిట్లన్నీ లాభాలతోనే నడుస్తున్నాయి. ఇంకా పెట్టుబడి పెడితే మరిన్ని లాభాలు వస్తాయి. పైగా ఈ యూనిట్లకు ఎక్కువుగా మధ్యతరగతి వర్గాలే వస్తుంటారు. బోటు రూ.100, రూము రూ.3,500లకు లభిస్తుంది. అదే ప్రైవేటు సంస్థకు ఇస్తే బోటు ధర రూ.500 , రూము ధర రూ.10 వేలు నిర్ణయిస్తే పర్యాటకుల ఆదరణ ఉంటుందా? మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఆదరించగలరా అన్న ఆలోచన కూడా ఉన్నతాధికారులు చేయటం లేదు.

తాకట్టు నుంచి విడిపించండి!

ప్రస్తుతం తాకట్టులో ఉన్న హరిత బెర్మ్‌పార్క్‌ను తక్షణం విడిపించే చర్యలు చేపట్టాలి. రూ. 110 కోట్లకు రుణ అగ్రిమెంట్‌ ఉన్నా చేసిన పనులను బట్టి సగాని కంటే తక్కువుగానే బ్యాంకుల నుంచి చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. కాబట్టి ప్రభుత్వం ఈ డబ్బులను బ్యాంకుకు ఫండ్‌గా ఇచ్చి.. రుణ విముక్తి కల్పించి.. వచ్చిన ఆదాయంలో కొంత డబ్బుతో ఆధునీకరణ చేపట్టుకునేలా వారికి స్వయం ప్రతిపత్తి ఇస్తే సరిపోతుంది. దీనివల్ల పర్యాటకులకు భారం కానీ పర్యాటకం అందుబాటులోకి వ స్తుంది.

Updated Date - May 14 , 2025 | 01:22 AM