ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పైప్‌లైన పనులను ఆపాలి: సీపీఎం

ABN, Publish Date - Apr 12 , 2025 | 11:46 PM

పైప్‌లైన పనులను ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు హెచ్చరించారు.

పై్‌పలైన వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఇతర సంఘాల నాయకులు

నందికొట్కూరు, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): పైప్‌లైన పనులను ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు హెచ్చరించారు. శనివారం పగిడ్యాల రోడ్డు బ్రహ్మంగారి మఠం వద్ద ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు మండల కేంద్రంలో స్టీల్‌ ప్లాంట్‌ కు తీసుకెళ్తున్న నీటి పైప్‌లైనను సీపీఎం, సీపీఐ, టీడీపీ, ఇతర సం ఘాల నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ కౌన్సిలర్‌ చాంద్‌బాషా, రావూఫ్‌, లాలుప్రసాద్‌, నా యబ్‌, సీపీఎం నాయకులు నాగేశ్వరరావు, సీపీఐ నాయకులు రఘురాంమూర్తి మాట్లాడుతూ ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు మండలంలో జరుగుతున్న స్టీల్‌ ప్లాట్‌ అవసరాల కోసం నందికొట్కూరు మున్సిపాల్టీలో ఎనిమిది అడుగుల లోతు, 8 అడుగుల వెడల్పుతో పైప్‌లైన తీసుకోవడం జరుగుతుందన్నారు. దీని వల్ల పట్టణంలోని పాతబస్టాండ్‌తో పాటు రెండు కిలోమీటర్ల పొడవులో ఉన్న షాపులు, ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించిన మంచినీటి పైప్‌లైన పగిలిపోయే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సప్లయర్స్‌ సత్యనారాయణ, డాక్టర్స్‌ అసోసియేషన నాయకుడు డా.రమేష్‌, కిరాణం అసోసియేషన నాయకులు మన్సూర్‌ భాష, విజయ్‌కుమార్‌, మెడికల్‌ షాప్‌ రంగయ్య, సీపీఎం నాయకులు గోపాలకృష్ణ, ఉస్మాన బాషా, అబ్దుల్‌ రషీద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 11:46 PM