ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Konaseema fraud: సీబీఐ పేరిట వృద్ధ దంపతులకు రూ.30 లక్షలకు టోకరా

ABN, Publish Date - Apr 26 , 2025 | 04:50 AM

కోనసీమలో రిటైర్డు ఉద్యోగ దంపతులను సీబీఐ అధికారులమని నమ్మించి మోసగాళ్లు రూ.30 లక్షలు వసూలు చేశారు. బెదిరింపులకు భయపడి డబ్బులు పంపిన దంపతులు, కుమారుడి సూచనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొత్తపేట, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగ దంపతులను ఆగంతకులు సీబీఐ అఽధికారులమంటూ బెదిరించి రూ.30 లక్షలకు టోకరా వేసిన ఉదంతమిది. ఎస్‌ఐ జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేట న్యూబ్యాంకు కాలనీలో నివాసముంటున్న కొయ్యా సత్యవతి సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంటులో వార్డెన్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆమె భర్త కొయ్యా శ్రీనివాస్‌ డీఆర్‌డీఏలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. వీరికి ఈ నెల 16న ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. తాము సీబీఐ అధికారులమని, మీ ఇద్దరిపై అరెస్టు వారెంట్‌ ఉందని తమ అకౌంట్‌కు రూ.30 లక్షలు జమ చేస్తే అరెస్టు కాకుండా చూస్తామని నమ్మబలికారు. బెదిరింపు కాల్స్‌ మళ్లీమళ్లీ రావడంతో దంపతులు భయపడి ఈ నెల 22న వారు చెప్పిన అకౌంట్‌కు ఆర్టీజీఎస్‌ ద్వారా రూ.30 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. విదేశాల్లో ఉంటున్న కుమారుడికి చెప్పడంతో ఆయన సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 04:50 AM