ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనుమతులు రద్దు చేయాల్సిందే..!

ABN, Publish Date - Jul 19 , 2025 | 11:18 PM

మండలంలోని హత్తిబెళగల్‌ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాల్సిం దేనని గ్రామస్థులు పట్టుబట్టారు.

అధికారుల వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలుపుతున్న గ్రామస్తులు

మైనింగ్‌ అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు

దాదపు అరగంట పాటు రోడ్డుపై బైఠాయింపు

మైనింగ్‌ లీజు రద్దుకు కలెక్టర్‌కు నివేదిస్తాం

మైనింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రవిచంద్‌

ఆలూరు, జూలై19(ఆంధ్రజ్యోతి): మండలంలోని హత్తిబెళగల్‌ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాల్సిం దేనని గ్రామస్థులు పట్టుబట్టారు. శనివారం పరిశీలనకు వచ్చిన జిల్లా మైనింగ్‌ అధికారులను గ్రామంలోకి రాకుండా పెద్దఎత్తున గ్రామస్థులు అడ్డుకున్నారు. దాదాపు అరగంట పాటు రోడ్డుపై బైఠా యించారు. అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అంగీకరించ లేదు. గ్రామపెద్దలు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలన్నారు. 2018లో ఇదే ప్రాంతంలో మైనింగ్‌ బ్లాస్టింగ్‌తో భారీ ప్రాణనష్టం జరిగిందని, ఇప్పుడు అనుమతులు ఎలా ఇస్తారని ఆగ్రహించారు. బ్లాస్టింగ్‌ జరిగితే ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని, వెంటనే అనుమతులు రద్దుచేయాలని వారు డిమాండ్‌ చేశారు. మైనింగ్‌కు అనుమతులు ఇచ్చిన కొండ ప్రాంతాన్ని జిల్లా మైనింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రవిచంద్‌, ఆర్‌ఐ బసవన్నగౌడ్‌ కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రవిచంద్‌ విలేకరులతో మాట్లాడారు. 2005లో ఈప్రాంతంలో రెవెన్యూ అధికారు లు నో అబ్జెక్షన్‌ ఇవ్వడంత్లో 2021లో శాంత శేఖర్‌ అనే వారి పేరు మీదుగా ప్రభుత్వం మైనింగ్‌కు అనుమతులిచ్చిందని గ్రామస్థులు కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఇచ్చారన్నారు. మైనింగ్‌తో ప్రజలకు ఇబ్బందులుంటే పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారన్నారు. ఇక్కడ ప్రజల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని బ్లాస్టింగ్‌ జరగకుండా చూస్తామన్నారు. మైనింగ్‌ లీజు రద్దుకు సంబంధించి కలెక్టర్‌కు నివేదిక ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jul 19 , 2025 | 11:18 PM