వైసీపీ ఉన్మాదులను ప్రజలు తిరస్కరించారు
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:31 PM
వైసీపీలోని నియంతలు, ఉన్మాదులను ప్రజలు తిరస్కరించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ధ్వజమెత్తారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
కర్నూలు, అర్బన, జూన 5(ఆంధ్రజ్యోతి): వైసీపీలోని నియంతలు, ఉన్మాదులను ప్రజలు తిరస్కరించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాఉతూ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్లించిన రోజుగా జూన 4 మిగిలిపోతుందన్నారు. పౌరులు స్వేచ్ఛ పొందిన రోజని అన్నారు. ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో తమకు ఓటేయలేదని ప్రజలే వెన్నుపోటు పొడిచారంటూ వైసీపీ వారు కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ వెన్నుపోటు వైసీపి పార్టీకే వర్తిస్తుందని అన్నారు. డీసీఎంఎస్ చైర్మన వై. నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ జగనరెడ్డి జైౖలుకు వెళ్తాడనే భయంతో ఉనికి చాటుకునేందుకు వైసీపీ వెన్నుపోటు కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ సమావేశంలో నాయకులు కేవీ సుబ్బారెడ్డి, మాల కార్పొరేషన డైరెక్టర్ పోతురాజు రవికుమార్, చంద్రకాంత, పుల్లయ్య, సత్రం రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 11:31 PM