Penna Cements Donation: సీతారామ లక్ష్మణులకు 7 కిలోల స్వర్ణకిరీటాలు
ABN, Publish Date - Apr 12 , 2025 | 03:45 AM
సీతారామ లక్ష్మణులకు రూ.6.60 కోట్ల విలువైన 7 కిలోల బంగారు కిరీటాలు విరాళంగా అందజేశారు పెన్నా సిమెంట్స్ అధినేతలు ఈ పుణ్య కార్యంలో పాల్గొన్నారు
పెన్నా సిమెంట్స్ అధినేతల విరాళం
ఒంటిమిట్ట, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఒంటిమిట్ట కోదండరామాలయంలోని సీతారామ లక్ష్మణులకు మండలంలోని మంటపంపల్లె గ్రామానికి చెందిన పెన్నా సిమెంట్ అధినేతలు మూడు స్వర్ణకిరీటాలను విరాళంగా అందించారు. శుక్రవారం స్థానిక కోదండరామాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మంలకు పెన్నా సిమెంట్ అధినేతలు ప్రతా్‌పరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి వీటిని అందజేశారు. సుమారు 7 కిలోల బంగారంతో తయారుచేసిన ఈ కిరీటాలు దాదాపు రూ.6.60 కోట్ల విలువ చేస్తాయి. అంతకుముందు వేణుగోపాల్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, రమేశ్‌రెడ్డి కోదండరాముడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Apr 12 , 2025 | 03:46 AM