ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

House of Ill Reputes: పెద్దాపురంపై మళ్లీ పాత ముద్ర

ABN, Publish Date - Jul 26 , 2025 | 03:51 AM

కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ప్రస్తుతం పది వరకు వ్యభిచార ముఠాలున్నాయి. అమాయక యువతులు, మైనర్‌ బాలికలకు మాయ మాటలు చెప్పి ఈ కూపంలోకి దించుతున్నాయి.

  • మూడేళ్లుగా జోరందుకున్న వ్యభిచారం

  • అమాయక యువతులకు ముఠాల గాలం

  • డబ్బు, విలాసాల ఆశ చూపి నరకం

  • ప్రేమ, పెళ్లి పేరుతోనూ అమ్మాయిలను తెచ్చి బలవంతంగా రొంపిలోకి

  • ఆశ్రయం పేరిట ఓ బాలిక జీవితం ఛిద్రం

  • నిర్వాహకులతో కొందరు పోలీసుల లాలూచీ

  • హత్యలకూ దారితీస్తున్న ముఠా తగాదాలు

(కాకినాడ/పెద్దాపురం-ఆంధ్రజ్యోతి)

కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ప్రస్తుతం పది వరకు వ్యభిచార ముఠాలున్నాయి. అమాయక యువతులు, మైనర్‌ బాలికలకు మాయ మాటలు చెప్పి ఈ కూపంలోకి దించుతున్నాయి. కాలేజీలు, హాస్టళ్లు, బస్టాండ్ల వద్ద తమ మనుషుల ద్వారా పరిచయాలు చేసుకుని డబ్బు, విలాసాల ఆశ చూపుతున్నాయి. స్థానిక కంపెనీల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల యువతులతో పరిచయం పెంచుకుని ఉచ్చులోకి లాగుతున్నాయి. ఈ క్రమంలో అమ్మాయిల కోసం ముఠాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో పాటు హత్యలకు సైతం దిగుతున్నారు. 2022లో కొన్ని వ్యభిచార గృహాలను పోలీసులు సీజ్‌ చేయగా కోర్టుకు వెళ్లి ఆర్డర్‌ తెచ్చుకుని మళ్లీ కొనసాగిస్తున్నారు. పైగా పోలీసు అధికారులపైనే వ్యభిచారం చేసే మహిళలతో కేసులు పెట్టించడం పరిపాటిగా మారింది. వారికి స్థానికంగా కొందరు నేతలు సహకరిస్తున్నారు. ఈ ముఠాల కారణంగా ఎంతోమంది అమాయక యువతులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ప్రేమ పేరుతో రొంపిలోకి..

దారుణమైన విషయం ఏంటంటే.. వ్యభిచార నిర్వాహకులు తమ కుమారుల ద్వారా అమ్మాయిలను ప్రేమ పేరుతో ఉచ్చులోకి లాగుతున్నారు. కాలేజీలు, హాస్టళ్లు, బస్టాండ్ల వద్దకు పంపి యువతులను ఆకర్షించి, విలాసాలు అలవాటు చేయిస్తున్నారు. ఆనక పెళ్లి పేరుతో ఇంటి నుంచి రప్పించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఇలా ఎందరో అమాయక యువతుల జీవితాలను నాశనం చేశారు. అనకాపల్లికి జిల్లాకు చెందిన ఓ బాలిక కొంతకాలం కిందట ఇంట్లో కోపగించి బయటకు వచ్చేసింది. ఆ అమ్మాయిని గుర్తించిన ఓ వ్యభిచార గృహనిర్వాహకురాలు చేరదీశారు. తన కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి ఆ బాలికను వ్యభిచార కూపంలోకి దించింది. తీవ్ర అనారోగ్యం పాలైన ఆ బాలిక ఆసుపాత్రి పాలైంది. చివరికి బాధితురాలిని సొంతవారు ఇంటికి తీసుకెళ్లారు.

వాట్సా‌ప్‌లోనూ బేరాలు

నిర్వాహకులు విటుల కోసం వ్యభిచార గృహాల్లో గుండ్రటి మంచం, ఖరీదైన విదేశీ మద్యం, ఆర్డర్‌ చేస్తే ఠక్కున వచ్చే నాన్‌వెజ్‌ వంటకాలు, గదుల్లో డ్యాన్సులకు రంగుల విద్యుత్‌ లైట్లు.. వంటి సదుపాయాలు సమకూరుస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా, ఇతర ప్రాంతాల్లోను విటులకు యువతుల ఫొటోలతో పాటు రేట్లను వాట్సా్‌పలో పంపుతున్నారు. కొందరు విటుల కోరికతో ముంబై నుంచి యువతులను రప్పిస్తున్నారు. నిర్వాహకులు వారం వారం లక్షల్లో సంపాదిస్తూ విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు.

పోలీసుల కక్కుర్తి

వ్యభిచార గృహనిర్వాహకులు తన కుమార్తెను వారి వద్ద ఉంచుకుని బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని ఇటీవల పెద్దాపురం పట్టణానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధిత బాలికను ఆమెకు అప్పగించి చేతులు దులిపేసుకున్నారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న భారతి అనే మహిళపై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. పైగా ఓ కానిస్టేబుల్‌, హోంగార్డు వ్యభిచార నిర్వాహకులకు మద్దతుగా ఉంటూ, అమ్మాయిలతో విందు, పొందు, డ్యాన్సులు చేస్తూ వీడియోలో దొరికిపోయారు. జాలీ ట్రిప్పులకు వెళ్లగా అవీ బయటపడ్డాయి. దీంతో వీరిద్దరినీ కాకినాడ జిల్లా ఎస్పీ సస్పెండ్‌ చేశారు. కొందరు పోలీసులు కాసులకుకక్కుర్తిపడి ముఠాలకు సహకరిస్తుండటంతో వారి వ్యాపారం అడ్డూ అదుపూ లేకుండా జరుగుతోంది. బాధిత యువతులు పోలీసులకు చెబితే కొందరు తిరిగి సమాచారాన్ని వ్యభిచార నిర్వాహకులకు చేరవేస్తున్నారు. వ్యభిచార ముఠాలు డబ్బు, వలపుల వల విసురుతూ కొందరు పోలీసులను తమదారికి తెచ్చుకుని బ్లాక్‌మెయిల్‌ చేసే స్థాయికి ఎదిగిపోయాయి.

ఇదీ నేపథ్యం..

కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పట్టణం ఒకప్పుడు రాజవంశాలకు కేంద్రంగా ఉండేది. అప్పటి సామాజిక పరిస్థితుల్లో దేవదాసీ వ్యవస్థకు, ప్రత్యేక వర్గాల మహిళల సేవలకు స్థానం ఉండేది. దేవాలయాలకు అంకితమయ్యే యువతులు దేవతసేవ పేరుతో కొన్ని సందర్భాల్లో రాజులు, జమీందార్లు, ఉన్నత స్థాయి వ్యక్తులకు సేవకులుగా మారిపోయారు. ఇది కాలక్రమంలో వ్యభిచారానికి దారితీసింది. ఎన్నో సినిమాల్లో పెద్దాపురం ప్రస్తావనతో డైలాగులు ఉన్నాయి. ఒకప్పుడు విలాసవంతమైన భవనాలు, తిరుగుడు మంచాలు, రహస్య గదులు, సుందరాంగులతో ఈ ప్రాంతం రెడ్‌ లైట్‌ ఏరియాను తలపించేది. ఎవరైనా పెద్దాపురం వెళ్తున్నామంటే వాళ్ల వైపు అదోరకంగా చూసేవారు. ఆ ఊరిలో చదువుకునేవారు, ఉద్యోగం చేసేవారు, ఇంకా ఆ ఊరి వాస్తవ్యులు బయటకు చెప్పడానికి వెనుకాడేవారు. తమ ప్రాంతానికి జరుగుతున్న నష్టం, పిల్లల పెళ్లిళ్లపై పడుతున్న ప్రభావంతో ఈ ఊరు కొన్ని దశాబ్దాలుగా కష్టపడి ఆ చెడ్డపేరును తొలగించుకుంది. అదే సమయంలో ఈ వృత్తిని సంప్రదాయంగా కొనసాగించే వర్గాల్లో మార్పు రావడంతో కాలక్రమేణా కనుమరుగైంది. ఆయా కుటుంబాల్లో యువత సైతం ఉన్నత విద్య ను అభ్యసించి, దేశ విదేశాల్లో స్థిరపడి గౌరవంగా బతుకున్నారు. ఇప్పుడు భారీ పరిశ్రమలతో పారిశ్రామికంగా పరుగులు తీస్తోంది. అయితే కొన్ని ముఠాలు మళ్లీ పాతరోజులను గుర్తుకు తెచ్చేలా ‘వ్యాపారం’ మొదలుపెట్టాయి. అసాంఘిక చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉం దని స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 07:48 AM